Dailyhunt
శ్రీలంక క్రికెట్‌లో గోల్డ్ చైన్ గొడవ

శ్రీలంక క్రికెట్‌లో గోల్డ్ చైన్ గొడవ

వార్త 2 weeks ago

Bhanuka Rajapaksa vs Harshi Rasanga: శ్రీలంక క్రికెట్‌లో ప్రస్తుతం ఒక బంగారు గొలుసు వ్యవహారం క్రీడా మరియు సినీ వర్గాలను షేక్ చేస్తోంది. స్టార్ క్రికెటర్ భానుక రాజపక్స , ప్రముఖ నటి హర్షీ రసంగ మధ్య మొదలైన ఈ వివాదం, ఇప్పుడు ప్రేమాయణం మరియు దొంగతనం ఆరోపణల మధ్య ఉత్కంఠగా మారింది.

శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స తన వద్ద ఉన్న సుమారు రూ. 9 లక్షల విలువైన బంగారు గొలుసును నటి హర్షీ రసంగకు తాత్కాలికంగా ఇచ్చారు. అయితే, ఆమె ఆ గొలుసును భానుక, కు చెప్పకుండానే తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు రావడంతో వివాదం మొదలైంది. రాజపక్స లాయర్లు పంపిన నోటీసులకు ఆమె స్పందించకపోవడంతో, తలంగమ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

Read Also: IPL 2026 : లక్నో పై ఢిల్లీ ఘన విజయం

Bhanuka Rajapaksa vs Harshi Rasanga: కోర్టులో విచారణ – బెయిల్ మంజూరు

కడువెల మేజిస్ట్రేట్ కోర్టులో హర్షీని హాజరుపరిచినప్పుడు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజపక్స అనుమతి లేకుండా గొలుసును తాకట్టు పెట్టిన మాట వాస్తవమేనని ఆమె లాయర్లు కోర్టులో అంగీకరించారు.త్వరలోనే ఆ గొలుసును విడిపించి తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇవ్వడంతో, కోర్టు ఆమెకు రూ. 5 లక్షల చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది.

 Bhanuka Rajapaksa Gold Chain Controversy

సోషల్ మీడియాలో ‘లవ్ అఫైర్’ బాంబు!

జైలు నుంచి బయటకు రాగానే హర్షీ రసంగ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తామిద్దరం గతంలో ప్రేమలో ఉన్నామని, ఆ సమయంలోనే భానుక ఆ గొలుసును తనకు కానుకగా ఇచ్చారని ఆమె వాదించడం మొదలుపెట్టారు. ప్రేమించి ఇచ్చిన వస్తువును ఇప్పుడు దొంగతనం కింద మార్చడం తగదని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో ఈ వివాదం ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరుకుంది.

నటి చేసిన లవ్ అఫైర్ వ్యాఖ్యలపై భానుక రాజపక్స ఇప్పటివరకు స్పందించలేదు. కాగా, కోర్టు మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఆ బంగారు గొలుసును తదుపరి విచారణ సమయానికి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 22న జరగనుంది. అప్పటివరకు ఈ గోల్డ్ చైన్ మిస్టరీ శ్రీలంక మీడియాలో సెన్సేషన్‌గా కొనసాగేలా కనిపిస్తోంది.

    Read Also hindi news: hindi.vaartha.com

    Read Also Epaper : epaper.vaartha.com

    Read Also:

    నేడు KKR, SRH మధ్య మ్యాచ్ ..గెలుపు ఎవర్ని వరిస్తుందో ?

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha