Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీలంకతో తొలి వన్డే.. బాబర్ ఆజం సరికొత్త రికార్డు

శ్రీలంకతో తొలి వన్డే.. బాబర్ ఆజం సరికొత్త రికార్డు

వార్త 6 days ago

Babar Azam: పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్‌ ఆజమ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. స్వదేశంలో ట్రైసిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో బాబర్‌ ఈ ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు ప్రారంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ నేపథ్యంలో బాబర్‌ ఆజమ్ బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.

Read also; Rinku Singh Century: రింకూ సింగ్ సెంచరీల మోత.. రంజీలో వరుసగా రెండో శతకం

అంతర్జాతీయ క్రికెట్‌లో 16,000 పరుగుల మైలురాయి:

అంతర్జాతీయ క్రికెట్‌లో 16,000 పరుగులు పూర్తి చేసుకున్న 5వ పాకిస్థాన్ క్రికెటర్‌గా బాబర్ చరిత్ర సృష్టించాడు. 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్ ఈ ఫీట్ సాధించాడు.

పాకిస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు:

ఇన్మామామ్-ఉల్-హక్: 20,541 పరుగులు

యూనిస్ ఖాన్: 17,790 పరుగులు

మహమ్మద్ యూసఫ్: 17,134 పరుగులు

జావెద్ మియాందాద్: 16,213 పరుగులు

బాబర్ ఆజమ్: 16,007* పరుగులు

బాబర్ కేవలం 355 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. అతని కెరీర్ యావరేజ్ 45.3గా ఉండగా, ఇందులో 32 సెంచరీలు, 111 అర్ధశతకాలు ఉన్నాయి.

మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 8,000 పరుగులు

అదేవిధంగా మరో రికార్డును కూడా బా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో స్థానంలో 8000 పరుగులు (మూడు ఫార్మాట్లలో) పూర్తి చేసుకున్న తొలి పాకిస్తానీ బ్యాటర్‌గా అవతరించాడు. స్వదేశంలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

పాకిస్థాన్ తరఫున నెం.3 స్థానంలో అత్యధిక పరుగులు చేసిన వారు:

బాబర్ ఆజమ్: 8,002* పరుగులు

యూనిస్ ఖాన్: 7,717 పరుగులు

అజహర్ అలీ: 5,615 పరుగులు

బాబర్ ఆజమ్ కెరీర్ ప్రయాణం

2015లో పాకిస్థాన్ తరఫున అరంగేట్రం చేసిన 32 ఏళ్ల బాబర్, కేవలం 11 ఏళ్లలోనే 16 వేల పరుగుల మైలురాయిని తాకాడు. 144 వన్డేల్లో 6,633 పరుగులు చేశాడు. 66 టెస్టుల్లో 4,771 పరుగులు సాధించాడు. 145 టీ20 మ్యాచ్‌లలో 4,596 పరుగులు చేసి, టీ20 అంతర్జాతీయ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.

అయితే, గత రెండు సంవత్సరాలుగా బాబర్ తన పాత ఫామ్‌ను పూర్తిస్థాయిలో కనబరచలేకపోతున్నాడు. 2024కి ముందు 114 వన్డేల్లో 56.72 సగటుతో 5,729 పరుగులు చేసిన బాబర్.. గత రెండేళ్లలో 26 ఇన్నింగ్స్‌లలో కేవలం 39.00 సగటుతో 897 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

నేటి నుంచే పారా ఏషియన్ గేమ్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha