Srisailam Temple: అష్టాదశ శక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మల్లన్నకు మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా నాదుర్గల్ వాస్తవ్యులు పి.
రవీందర్ మరియు కుటుంబసభ్యులు,అయిదు శిరస్సులతో కూడిన వెండి నాగాభరణాన్ని మరియు వెండి చెంబును దేవస్థానమునకు సమర్పించారు.ఈ వెండి నాగాభరణం మరియు వెండి చెంబుతో కలిపి బరువు 416 గ్రాములు కలిగి ఉన్నాయని దాతలు తెలిపారు.

అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపములో దాతలు అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజి రవి, ఉపప్రధానార్చకులు బి. వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, అమ్మవారి ఆలయం ఇన్‌స్పెక్టర్ కె. మల్లికార్జున, లకు అందజేశారు.
అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేయడం జరిగింది.
Epaper: epaper.vaartha.com

