Srisailam Hundi Income: అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో సోమవారం నాడు జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.
4,22,29,240 /-లు నగదు రాబడిగా లభించింది. కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత 32 రోజులలో సమర్పించడం జరిగింది. అలాగే ఈ హుండీలో 75 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారం, 2 కేజీల 900 గ్రాముల వెండి లభించాయి.

అదేవిధంగా 417 – యుఎస్ఏ డాలర్లు, 65- యు.ఏ.ఇ దిర్హమ్స్, 60 - ఇంగ్లాండు పౌండ్స్, 100 - కెనడా డాలర్లు, 500 - ఓమన్ బైసా, 1 – ఓమన్ రియాల్, 25 - యూరోస్, 2- మలేషియా రింగిట్స్, 10 – సౌదీరియాల్స్, 10 - న్యూజిలాండ్ డాలర్లు, 2 - సింగపూర్ డాలర్లు , 10 - ఈజిప్ట్ ఫౌండ్స్ మొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ హుండీల లెక్కింపును ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అదేవిధంగా హుండీల లెక్కింపులో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఎస్. చంద్రశేఖర్, పలువిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

