Srisailam MLA : నంద్యాల జిల్లాలోని సున్నిపెంట (సుండుపెంట) గ్రామాభివృద్ధి పనులకు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి శ్రీకారం చుట్టారు.
రూ. 10 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన సిసి రోడ్లు, తాగునీటి సరఫరా అభివృద్ధి పనులను మే 20న వారు సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం సున్నిపెంట బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో స్థానిక భూ సమస్యలపై ప్రజలకు కీలక భరోసా ఇచ్చారు.
భూ సమస్యలపై కలెక్టర్ కీలక ప్రకటన
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. ప్రజా ఆస్తులన్నీ ప్రజలకే చెందుతాయని, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ఆశయమని స్పష్టం చేశారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి కార్యక్రమం కోసం శ్రీశైలం వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇక్కడి రోడ్ల దుస్థితిని, అవసరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. సీఎం ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించిన భూసర్వేలో.. కొండవాలు ప్రాంతాల్లో భూమి జారిన తర్వాత ప్రస్తుతం 1427 ఎకరాల 24 సెంట్ల భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించామన్నారు. సున్నిపెంట భూముల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు.
Read also : MLA Lokam Naga Madhavi : మత్స్యకారులకు రూ.20,000 భృతి!
Srisailam MLAప్రజలకు అన్యాయం జరగనివ్వం: ఎమ్మెల్యే బుడ్డా
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ.. సున్నిపెంట ప్రజలు భూములు, ఇళ్ల విషయంలో ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు ఇచ్చే నోటీసులను స్వీకరించి, గతంలో ప్రభుత్వం తమకు కేటాయించిన ఇంటి పట్టాలు, ఇతర పత్రాలను సమాధానంగా సమర్పించాలని ప్రజలకు సూచించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలకు అన్యాయం జరగనివ్వబోమని భరోసా ఇచ్చారు. ఇప్పటికే రూ. 10 కోట్లతో మెజారిటీ వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే ఇంటింటికీ కుళాయిల ద్వారా ప్రతిరోజూ తాగునీరు అందిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా గృహాలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

