Srisailam temple:శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీ టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత నెల రోజులుగా నిర్వహణ పనుల కారణంగా నిలిచిపోయిన పాతాళగంగ రోప్ వే సేవలు నేటి నుంచి యథావిధిగా ప్రారంభమయ్యాయి.
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు పాతాళగంగకు వెళ్లడానికి ఈ రోప్ వే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read also: AP e panta registration: ఈ-పంట నమోదు లేకపోతే బీమా డబ్బులు రావు
Srisailam Patala Ganga Ropeway
భక్తుల భద్రత కోసం రోప్ వే ఆధునీకరణ పనులు
రోప్ వే మేనేజర్ పెంచల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గత ముప్పై రోజులుగా యంత్రాలు రోప్స్ క్యాబిన్స్ పూర్తిగా తనిఖీ చేశారు. దాదాపు ఇరవై సంవత్సరాలు పూర్తయిన ఈ సేవలను భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు మెరుగైన వసతులు కల్పించారు. ప్రస్తుత తక్కువ భక్తుల రద్దడి సమయం చూసి ఈ మరమ్మత్తులు పూర్తి చేశారు. దీనివల్ల రాబోయే పదేళ్ల పాటు ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది.
Srisailam temple:టూరిస్టులకు మెరుగైన సేవలు అందుబాటులోకి
పాతాళగంగ ప్రయాణం సులభతరం కావడంతో పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా నేటి నుంచి టూరిజం రోప్ వే సేవలను భక్తులు వినియోగించుకోవచ్చు. శ్రీశైలం వచ్చే ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టూరిజం శాఖ వెల్లడించింది.
Epaper: epaper.vaartha.com

