Srisailam : శ్రీశైలం టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతం గుండా ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మొదటగా 2 లేన్లుగా నిర్మించాలని భావించిన ఈ కారిడార్‌ను, భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని 4 లేన్లుగా విస్తరించాలని నిర్ణయించింది.
తెలంగాణలోని మన్ననూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం వరకు దాదాపు 54 కిలోమీటర్ల మేర ఈ ప్రతిష్టాత్మక రోడ్డును నిర్మించనున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు బాధ్యతలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నుంచి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కి బదిలీ చేశారు. గతంలో 2 లేన్ల ప్రాజెక్టు కోసం రూ.7,668 కోట్లుగా అంచనా వేయగా, ఇప్పుడు 4 లేన్లకు విస్తరించడం వల్ల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

ప్రయాణ సౌలభ్యం వర్సెస్ పర్యావరణ సవాళ్లు
ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మరింత వేగవంతం కావడంతో పాటు, శ్రీశైల క్షేత్రానికి వెళ్లే భక్తులకు ప్రయాణం ఎంతో సులభతరం కానుంది. అయితే, 4 లేన్లుగా విస్తరించడం వల్ల అటవీ ప్రాంతంలో విస్తృత స్థాయిలో భూసేకరణ, నిర్మాణాలు చేపట్టాల్సి వస్తుంది. దీనివల్ల శ్రీశైలం నల్లమల అడవుల్లోని దాదాపు 2 లక్షల చెట్లను నరికివేయాల్సి వస్తుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇది వన్యప్రాణుల ఆవాసాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారి షిరీన్ బేగం కుమార్తె ఆసిఫా మృతి

