International Yoga Day 2026:1000 మందితో యోగా కార్యక్రమము. యోగా వలన మనస్సుకు ప్రశాంతత. యోగా వలన ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చు ఆరోగ్యకరమైన జీవనానికి యోగా తొలిమెట్టు.
శ్రీశైల దేవస్థానంలో. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమము ఆలయ ముందుభాగంలో గల గంగాధరమండపం వద్ద ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయబడింది. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు ఆయా ఏర్పాట్లను చేసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. ముందుగా సంప్రదాయాన్ని అనుసరించి అర్చకస్వాములు, అధికారులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత ఒంగోలు నగరానికి చెందిన చిన్నారులు రాధారమణి శివస్తోత్రానికి సంప్రదాయ నృత్యం ప్రదర్శించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ యోగా శిక్షకులు, యోగాచార్య, గంధవళ్ల బాలసుబ్రహ్మణ్యం, ఒంగోలు వారు ఆయా అంశాలను వివరిస్తూ అందరిచేత యోగాసనాలు చేయించారు. ప్రతి ఆసనానికి కూడా వీరు వివరణ ఇస్తూ, యోగాపరమైన అంశాలను అధునిక వైద్య విజ్ఞానంతో అనుసంధానం చేస్తూ ఆయా విశేషాలను, యోగా వల్ల కలిగే ప్రయోజనాలను పేర్కొన్నారు.
Read also: Fathers Day 2026: హ్యాపీ ఫాదర్స్ డే!
కార్యక్రమం ముగింపు సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ ప్రపంచానికి యోగాని అందించిన మహోన్నత సంప్రదాయం మన ఋషులు మనకు ఏర్పర్చారని, పారంపర్యంగా వాటిని మనం అందిపుచ్చుకున్నామని, భవిష్యత్ తరాలకు దీనిని అందించాలని అన్నారు. ఈ యోగాను భావిపౌరులైన మన చిన్నారులకు నేర్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆలయాలు కేవలం భక్తికి మాత్రమే కాకుండా విద్యకు, వైద్యానికి మరెన్నింటికో నిలయంగా ఉండేవన్నారు. ఆలయాలలో యోగా చేస్తే రెట్టింపు శక్తి, ఉత్సాహనిస్తుందన్నారు. ఆ తరువాత కార్యనిర్వహణాధికారి శ్రీనివాస రావు మాట్లాడుతూ యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదని, అది ఒక జీవన విధానమని, ఈ ఆసనాలతో మన నిత్యజీవితములో మనం అనుభవించే ఒత్తిడి, శ్రమ మొదలైన వాటిని అతిసులభంగా నివారించుకోవచ్చునని పేర్కొన్నారు. గత 15 రోజులుగా ప్రతీరోజు యోగా శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని, అందుకు సహకరించిన యోగాచార్యులకు ధన్యవాదాలు తెలిపారు. యోగా గురువు గంధవళ్ల బాలసుబ్రహ్మణ్యం శారీరక ఆసనాలు, శ్వాసపై ధ్యాస, ధ్యానం, ప్రాణాయామం, ముద్రలు మొదలైనవన్నీ యోగాలోని ప్రధాన క్రియలు అని చెప్పారు.
International Yoga Day 2026:ఓంకార ఆకృతిలో యోగా సాధన
కార్యక్రమములో వీరు త్రికోణాసనం, వజ్రాసనము, భుజంగాసనం, శలభాషనం మొదలైన ఆసనాలను చేయిస్తూ వాటివలన కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆసనాల తరువాత సూక్ష్మవ్యాయమం చేయించబడింది. సూక్ష్మవ్యాయమం తరువాత ప్రాణాయామం చేయించబడింది. కపాలభాతి, అనులోమ విలోమ, శీతలి, భ్రామరి మొదలైన విధానాలతో ప్రాణాయామం కొనసాగింది. ప్రాణాయామం తరువాత ధ్యానం చేయించబడింది. చివరగా శాంతిమంత్రాలతో ఈ యోగా కార్యక్రమం ముగించబడింది. ఓంకార ఆకృతిలో యోగా యోగాసనాల అనంతరం ఓంకారం ఆకృతిలో యోగాసాధకులు యోగాను ఆచరించారు. దేవస్థానం ఆగమ పాఠశాల విద్యార్థులు మరియు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ఓంకారం ఆకృతిలో నెలకొని ఈ యోగాను నిర్వహించడం జరిగింది. సంప్రదాయబద్ధంగా ఓంకార ఆకృతిలో దేవస్థానం యోగాను నిర్వహింపజేయడం పట్ల పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన డా. దీవి హయగ్రీవాచార్యులు, నంద్యాల వారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.యోగ విశిష్ఠతను, పలు యోగసాధనత కలిగే ఆధ్యాత్మికానుభూతి విశేషాలను వివరించారు. అనంతరం యోగా గురువులకు, కార్యక్రమములో పాల్గొన్న అధికారులకు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డు ప్రసాదాలను అందజేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

