LIC Bhima Sakhi Scheme:లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న LIC భీమా సఖి పథకం మహిళల ఆర్థిక స్వతంత్రతకు మంచి మార్గం చూపుతోంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా మహిళలు ఇంట్లో ఉంటూనే ఆర్థికంగా స్థిరపడేలా శిక్షణ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
బీమా రంగంలో మహిళలను ప్రోత్సహించడం, వారిని ఏజెంట్లుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. దీని ద్వారా మహిళలు సొంతంగా ఆదాయం సంపాదిస్తూ ఆర్థిక అక్షరాస్యతను పెంచుకోవచ్చు.
Details of the LIC Bima Sakhi Scheme
పథకం ప్రయోజనాలు, స్టైఫండ్ వివరాలు
ఈ పథకంలో చేరిన మహిళలకు LIC ప్రత్యేక శిక్షణ అందిస్తుంది, తద్వారా వారు బీమా పాలసీలను వివరించడంలో నైపుణ్యం సాధిస్తారు. మొదటి ఏడాది ప్రతి నెలా 7 వేల రూపాయలు, రెండో ఏడాది 6 వేల రూపాయలు, మూడో ఏడాది 5 వేల రూపాయల చొప్పున స్టైఫండ్ లభిస్తుంది. కేవలం స్టైఫండ్ మాత్రమే కాకుండా, తాము విక్రయించే ప్రతి పాలసీపై నిర్ణీత కమీషన్ కూడా పొందవచ్చు. ఇది మహిళలు వారి ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడకుండా ఉండటానికి చక్కని అవకాశం.
LIC Bhima Sakhi Scheme:అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ
ఈ అవకాశాన్ని పొందడానికి ఆసక్తి ఉన్న మహిళలు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్ల నుండి 70 ఏళ్ల మధ్య ఉండాలి, ఇది అన్ని వయసుల మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. ఆసక్తి ఉన్నవారు స్థానిక LIC కార్యాలయాన్ని సంప్రదించి అవసరమైన ధృవపత్రాలు సమర్పించి ఏజెంట్‌గా నమోదు చేసుకోవాలి. శిక్షణ పూర్తయ్యాక, వారు ఏజెంట్లుగా క్షేత్రస్థాయిలో పని చేస్తూ ఆర్థికంగా వృద్ధి చెందవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

