Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షూటింగ్‌లో ఆరో రోజు భారత్‌కు స్వర్ణం, రజతం!

షూటింగ్‌లో ఆరో రోజు భారత్‌కు స్వర్ణం, రజతం!

వార్త 0 months ago

Asian Games 2026: జపాన్‌లోని ఐచీ-నగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ ఆరో రోజు భారత అథ్లెట్లకు అద్భుతమైన ఆరంభం లభించింది. భారత షూటర్లు తమ మార్క్ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో దేశ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక రజత పతకం చేరాయి.

ఈ విజయాలతో ఆసియా గేమ్స్‌లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 19కి చేరింది.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన సురుచి, కమల్‌జీత్ జోడీ అద్భుత ప్రదర్శనతో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఈ కాంబినేషన్ కేవలం స్వర్ణంతో సరిపెట్టకుండా, క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే ఆసియా రికార్డును సమం చేసి సరికొత్త సంచలనం సృష్టించింది.

Read Also : Asian Games Shooting: భారత్‌కు మరో పతకం.. మహిళల స్కీట్ టీమ్‌కు కాంస్యం

 Asian Games: India wins gold and silver in shooting on Day 6!

Asian Games 2026: రైఫిల్ 3 పొజిషన్స్‌లో రజతం

పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లోనూ భారత్ మెరిసింది. ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్, రుద్రాంక్ష్ పాటిల్‌లతో కూడిన భారత జట్టు స్థిరమైన ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

మరోవైపు ఇతర క్రీడల్లోనూ భారత్‌కు పతకాలు ఖాయమయ్యాయి. టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో దియా చౌతాలే – మనుష్ షా జోడీ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లి భారత్‌కు కనీసం కాంస్యాన్ని ఖరారు చేసింది. అలాగే స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో వెటరన్ ప్లేయర్ జోష్నా చినప్ప – వెలవన్ సెంథిల్‌కుమార్ జంట కూడా సెమీస్‌కు చేరి పతకాన్ని నిలబెట్టుకుంది.

నేడు కబడ్డీ, అథ్లెటిక్స్ మ్యాచ్‌లపైనే దృష్టి

ప్రస్తుతం క్రీడాభిమానుల దృష్టి కబడ్డీ సెమీఫైనల్స్‌పై నిలిచింది. పురుషుల, మహిళల జట్లు రెండూ తమ కీలకమైన మ్యాచ్‌లు ఆడనున్నాయి. వీటితో పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో మహిళల షాట్‌పుట్, పోల్ వాల్ట్, పురుషుల 10,000 మీటర్లు, హ్యామర్ త్రో వంటి విభాగాల్లో భారత అథ్లెట్లు పతకాల కోసం బరిలోకి దిగనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha