Karnataka CM Resign : కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హైడ్రామా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజే తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉండగా, ఈ వ్యవహారంలో ఒక ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
దీంతో సిద్ధరామయ్య రాజీనామా సమర్పణ, తదుపరి పరిణామాలపై సస్పెన్స్ మరింత కొనసాగుతోంది. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం బెంగళూరులో అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా మారింది. తన కుటుంబంలో ఒక అత్యవసర పరిస్థితి (Family Emergency) తలెత్తడంతో గవర్నర్ నిన్న రాత్రి హుటాహుటిన ముంబై వెళ్ళిపోయారు. ఆయన తిరిగి బెంగళూరుకు ఎప్పుడు వస్తారనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. గవర్నర్ గైర్హాజరీ కారణంగా సిద్ధరామయ్య రాజీనామా అధికారిక ఆమోద ప్రక్రియకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also : మోదీతో ముగిసిన విజయ్ సమావేశం

గవర్నర్ ఆఫీస్‌లో రాజీనామా సమర్పణ?
గవర్నర్ అందుబాటులో లేనప్పటికీ, సిద్ధరామయ్య ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే తన రాజీనామా లేఖను రాజ్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్ కార్యాలయంలోని (Governor Office) అధికారులకు సమర్పించనున్నట్లు గట్టి సమాచారం అందుతోంది. రాజీనామా లేఖను ఆఫీసులో అందజేసినా, గవర్నర్ స్వయంగా వచ్చి దానిని పరిశీలించి ఆమోదముద్ర వేసేవరకు పాత ప్రభుత్వ సాంకేతిక ప్రక్రియలు కొనసాగుతాయి. గవర్నర్ ముంబై నుండి తిరిగి వచ్చిన తర్వాతే నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అధికారిక ఏర్పాట్లు మరియు తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రానుంది. సీఎం రాజీనామా ఖాయమైన వేళ, గవర్నర్ ప్రయాణం వల్ల ఏర్పడిన ఈ స్వల్ప విరామం కర్ణాటక కాంగ్రెస్ శ్రేణులలో మరియు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

