Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్

సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్

వార్త 1 week ago

Jagan : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అంపోలు జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, పార్టీ కీలక నాయకుడు సీదిరి అప్పలరాజుతో ఆయన ములాఖత్ కానున్నారు.

ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ, విచారణ పరిణామాల నేపథ్యంలో జైలు శిక్ష అనుభవిస్తున్న సీదిరి అప్పలరాజును నేరుగా కలిసి పరామర్శించడంతో పాటు, ఆయనకు పార్టీ పరంగా పూర్తి అండదండలు ప్రకటిస్తారని వైఎస్సార్‌సీపీ వర్గాలు వెల్లడించాయి. అధినేత స్వయంగా రాకతో శ్రీకాకుళం జిల్లా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

అప్పలరాజు కుమారుడికి బెయిల్: కోర్టు తీర్పుపై ఉత్కంఠ

మరోవైపు గొర్రెల కాపరి మృతికి సంబంధించిన కేసులో అరెస్టయిన సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మకు ఊరట లభించింది. సోంపేట జిల్లా ఆరో అదనపు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసుతో సంబంధమున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి, తీర్పును రిజర్వ్ చేశారు. బెయిల్ తీర్పు వెలువడే సమయానికి ముందే వైఎస్ జగన్ పర్యటన ఖరారు కావడం, స్థానిక వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha