Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్నికల సంఘానికి నోటీసులు

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్నికల సంఘానికి నోటీసులు

వార్త 2 weeks ago

Supreme Court: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)లో నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అనుమతి లేకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం పరిశీలించింది.

Supreme court orders: కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం

ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఈ వ్యవహారంపై వెంటనే సీఈసీని సస్పెండ్ చేయాలన్న మధ్యంతర అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ముందుగా ఎన్నికల సంఘం వాదనను తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంటూ ఈసీకి నోటీసులు జారీ చేసింది. సీఈసీ తీసుకున్న నిర్ణయాలు అవసరమైన ఏకాభిప్రాయం లేకుండా తీసుకున్నట్లు ఈసీ సమాధానం ద్వారా తేలితే.. ఆ నిర్ణయాలను తిరిగి పరిశీలించే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి.

ఏకపక్ష నిర్ణయాలపై ఆరోపణలు

ఈ పిటిషన్లలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. ఎన్నికల సంఘం మొత్తం తీసుకోవాల్సిన నిర్ణయాలను ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండానే తీసుకున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు సంబంధించిన కొన్ని నిర్ణయాలు, మార్గదర్శకాలు, సాఫ్ట్‌వేర్ మార్పులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం SIRకు సంబంధించిన నిర్ణయాలు సీఈసీతో పాటు ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతితోనే తీసుకున్నామని గతంలో స్పష్టం చేసింది. దీంతో పిటిషన్లలోని ఆరోపణలు, ఈసీ వివరణను పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Supreme Court: సీఈసీపై చర్యలకు సంబంధించిన పిటిషన్లు

ఈ వివాదం నేపథ్యంలో సీఈసీని సస్పెండ్ చేయాలని, ఆయన తీసుకున్నట్లు ఆరోపిస్తున్న కొన్ని నిర్ణయాలను చెల్లనివిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ప్రస్తుతం ఈ ఆరోపణలపై ఈసీ స్పందనను కోరింది. తదుపరి విచారణలో ఈసీ సమర్పించే వివరాలు కీలకంగా మారనున్నాయి.

Epaper: epaper.vaartha.com

నిరసనల్లో నేమ్ ట్యాగ్‌లు లేని పోలీసులపై ఢిల్లీ పోలీసుల వివరణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha