CM Revanth Visit to Palamuru: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. జిల్లాలో నిర్మాణంలో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టులను సీఎం స్వయంగా సందర్శించి, పనుల పురోగతిపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
సాయంత్రం ఉద్దండాపూర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు.
Read Also: Peddashankaram Tree Plantation: ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం.. పచ్చదనం పెంచుదాం
CM Revanth Visit to Palamuru
కేసీఆర్ హయాం నాటి అప్పులకే రూ.52 వేల కోట్లు కట్టాం: రేవంత్ రెడ్డి
గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికే తమకు సమయం పట్టిందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. “మేము అధికారంలోకి వచ్చాక ఏది ఎక్కడ ఉందో సరిచూసుకునేందుకే రెండేళ్లు పట్టింది. మేము ప్రజాహిత పనులు చేపడుతుంటే, విపక్షాలు మాత్రం రాజకీయ కార్యాచరణతో అడ్డుపడుతున్నాయి” అని ఆరోపించారు. గత పాలకులు పాపాలు చేయడమే కాకుండా, కేసీఆర్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం కూడా మహాపాపమని దుయ్యబట్టారు. గతంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో చేసిన అప్పులకు గానూ రూ.84 వేల కోట్లు చెల్లించారని, తాము అధికారంలోకి వచ్చాక వారి అప్పుల కోసమే రూ.52 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందని సీఎం వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.22 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇందులో రూ.8 వేల కోట్లు కేవలం పాలమూరు జిల్లా ప్రాజెక్టులకే కేటాయించామని తెలిపారు. జిల్లాలో మిగిలిన ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఇంకా 4 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
CM Revanth Visit to Palamuru: రాబోయే ఐదేళ్లలో రికార్డు స్థాయిలో ఆయకట్టు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రితో కలిసి కరివెన రిజర్వాయర్‌ను పరిశీలించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఆయకట్టు పెరగబోతోందని, ప్రజలకు సాగునీరు, తాగునీరు పెద్ద ఎత్తున అందుబాటులోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి రూ.లక్ష కోట్ల అప్పులు తెచ్చారని, అయినప్పటికీ కాళేశ్వరం సహా ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదని మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అవసరాలను పక్కనబెట్టి, జూరాల నుంచి శ్రీశైలానికి నీళ్లు మళ్లించడం గత ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదమని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
హైదరాబాద్ ప్రయాణికులకు షాక్: ఉచిత MMTS ప్రతిపాదనను తిరస్కరించిన రైల్వే బోర్డు!

