Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని టైజీఎఫ్డీసీ (TGFDC) చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నేతృత్వంలోని సినీ ప్రముఖుల ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది.
ఈ సమావేశం అత్యంత సౌహార్ద్ర వాతావరణంలో కొనసాగింది. రాష్ట్రంలో సినీ రంగానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది.
'బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్-2026' వేడుకలకు ఆహ్వానం
ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న 'బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్-2026' అవార్డుల ప్రదానోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ బృందం ఘనంగా ఆహ్వానించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి యువ చలనచిత్ర సృష్టికర్తలను అభినందించాలని సీఎంను కోరారు.
Revanth Reddy: భేటీలో పాల్గొన్న ప్రముఖులు
ముఖ్యమంత్రితో జరిగిన ఈ సమావేశంలో దిల్‌రాజుతో పాటు ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, చరణ్ అర్జున్, నల్గొండ గద్దర్ తదితరులు పాల్గొన్నారు. యువ సినీ ప్రతిభను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చిత్ర పరిశ్రమ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
Epaper: epaper.vaartha.com

