Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం రేవంత్ రెడ్డివి "మతిలేని మాటలు".. హరీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డివి "మతిలేని మాటలు".. హరీశ్ రావు

వార్త 2 months ago

Harish Rao counters Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టు సందర్శనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డివి “మతిలేని మాటలు” అంటూ ఆయన తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన హరీశ్ రావు… బీఆర్ఎస్ చేపట్టబోయే పాదయాత్ర భయంతోనే సీఎం రేవంత్ రెడ్డికి రాత్రిళ్లు నిద్ర కరువైందని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై తమను విమర్శించే నైతిక హక్కు ముఖ్యమంత్రికి లేదని ఆయన స్పష్టం చేశారు.

Read Also : Attapur Crime : హైదరాబాద్‌లో ఘోర కలకలం: భార్య ఆలస్యంగా వస్తోందని ఇద్దరు పిల్లల ముందే దారుణ హత్య!

 CM Revanth Reddy’s “insane words”… Harish Rao

Harish Rao counters Revanth Reddy: చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు..

“అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుకు చేసిందేమీ లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర ద్రోహం చేస్తున్నారు. అందుకే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ 75 శాతం కృష్ణా నీటిని వాడుకుంటే, తెలంగాణ కేవలం 25 శాతానికే పరిమితం కావాల్సి వచ్చింది” అని హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘోర వైఫల్యానికి గానూ సీఎం రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కొడంగల్‌లో రేవంత్‌ను మళ్లీ ఓడిస్తాం

గత బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. పాలమూరు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఆయన్ను మళ్లీ ఓడించి తీరుతామని, పాలమూరు గడ్డపై గులాబీ జెండాను రెపరెపలాడిస్తామని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మానకొండూర్ కవ్వంపల్లికి తప్పిన పెద్ద ప్రమాదం.. ఒక్కసారిగా కింద పడ్డ లిఫ్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha