Revanth Reddy Foreign Tour: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. ఈ నెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు.
రాష్ట్రంలో విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు క్రీడా రంగాలను మరింత ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఈ టూర్‌లో భాగంగా వివిధ అంతర్జాతీయ విదేశీ విశ్వవిద్యాలయాలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు, రాబోయే తరాలకు వైట్‌కాలర్ మరియు బ్లూ కాలర్ ఉద్యోగాలకు అవసరమైన అత్యాధునిక నైపుణ్యాలపై విదేశీ ప్రతినిధులతో సీఎం చర్చలు జరపనున్నారు.

తొలుత లండన్ పర్యటన.. ప్రముఖ విద్యాసంస్థల సందర్శన
విదేశీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలుత తొలుత బ్రిటన్ రాజధాని లండన్‌కు వెళ్లనున్నారు. లండన్‌లోని పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థలను సీఎం బృందం ప్రత్యక్షంగా సందర్శించనుంది. అక్కడి విద్యా విధానాలు, నైపుణ్య శిక్షణ కేంద్రాల పనితీరును పరిశీలించి, రాష్ట్రంలో ఆ పద్ధతులను అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించనున్నారు.
Revanth Reddy Foreign Tour: అమెరికా యూనివర్శిటీల ప్రతినిధులతో భేటీ
లండన్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 23న అమెరికాకు పయనం కానున్నారు. అమెరికాలో పలు ప్రముఖ యూనివర్శిటీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. విద్యా, ఉపాధి రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేలా ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా, తెలంగాణ యువతకు గ్లోబల్ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించేలా ఈ భేటీలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

