Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎంగా విజయ్ నేడు తొలిసారి ఢిల్లీ పర్యటన..ప్రధాని మోదీతో భేటీ

సీఎంగా విజయ్ నేడు తొలిసారి ఢిల్లీ పర్యటన..ప్రధాని మోదీతో భేటీ

వార్త 2 weeks ago

Cm vijay delhi tour: తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత జోసెఫ్ సి. విజయ్ బుధవారం నాడు మొట్టమొదటిసారిగా దేశ రాజధాని ఢిల్లీలో అధికారికంగా పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లను ప్రత్యేకంగా కలవనున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి లక్ష్యంగా ఈ ఉన్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయి.

 cm joseph vijay delhi tour to meet pm modi

Read also: Illegal immigration: ప్రతి అక్రమ వలసదారుడిని వెనక్కి పంపుతాం: అమిత్ షా

పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు.. ప్రత్యేక నిధులకై వినతి!

రాష్ట్ర ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన అదనపు ఆర్థిక సాయాన్ని అందించాలని సీఎం విజయ్ ఈ భేటీలలో కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. వీటితో పాటు తమిళనాడులో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు కీలక మౌలిక వసతుల కల్పన, పారిశ్రామిక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి ఆయన వినతిపత్రాలు సమర్పించనున్నారు.

Cm vijay delhi tour: ఒకేరోజు పర్యటన.. రాత్రికే చెన్నై తిరుగుపయనం!

బుధవారం ఉదయమే దిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి విజయ్, కేంద్ర పెద్దలతో వరుస సమావేశాలు ముగించుకుని అదే రోజు రాత్రికి తిరిగి చెన్నై చేరుకుంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తమిళనాడుకు అత్యంత కీలకమైన సంక్షేమ పథకాలు, పారిశ్రామిక వృద్ధి, రవాణా రంగ కనెక్టివిటీ ప్రాజెక్టుల విస్తరణకు కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించేలా ఈ పర్యటనలో ఆయన గట్టిగా చొరవ చూపనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక కేటాయింపులను సాధించుకోవడమే ఈ దిల్లీ పర్యటన ముఖ్య ఉద్దేశం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha