Medak Health Department: మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యాధికారి డా. గనేశ్వర్ అన్నారు. గురువారం నాడు పెద్ద శంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆస్పత్రిలోని వివిధ విభాగాలు, ఔట్‌పేషెంట్ సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, రిజిస్టర్లు, రికార్డులు, పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రతి అనుమానిత కేసును వెంటనే గుర్తించి చికిత్స అందించాలని సిబ్బందికి సూచించారు.
Read Also : Indiramma Indlu scheme: ఇందిరమ్మ ఇళ్లపై వదంతులు నమ్మొద్దు.. హౌసింగ్ బోర్డ్ విసి
Special measures for the prevention of seasonal diseases: Medical Officer Dr. Ganeshwar
Medak Health Department: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు
అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి వంటగది, స్టోర్‌రూమ్, ఆహార నిల్వలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. తర్వాత మండలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని తనిఖీ చేసి వైద్య సేవలు, నిర్వహణ, రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో జిల్లా మలేరియా అధికారి శ్రీ చందర్, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ హరిప్రసాద్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నవ్య, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డా. షర్ఫుద్దీన్, హెల్త్ ఎడ్యుకేటర్ కె. యాదయ్య, హెల్త్ అసిస్టెంట్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

