Sikkim Tunnel Blast: ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. నామ్‌చి (Namchi) జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్‌పీసీ (NHPC) తీస్తా స్టేజ్-6 జలవిద్యుత్ ప్రాజెక్టు (Teesta Stage-VI Hydroelectric Project) కింద నిర్మిస్తున్న టన్నెల్‌లో భారీ పేలుడు సంభవించింది.
సొరంగం లోపల ప్రమాదకరమైన మీథేన్ గ్యాస్ లీకై పేలడంతో కొండచరియలు విరిగిపడి బయటకు వచ్చే దారి మూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also :Accident in Khammam : ఖమ్మం జిల్లా ఏదులాపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం

అసలేం జరిగింది?
సమర్‌డుంగ్ ప్రాంతంలో పటేల్ ఇంజినీరింగ్ సంస్థ చేపడుతున్న ఈ టన్నెల్ పనుల్లో దాదాపు 1.5 కిలోమీటర్ల లోపల సహజంగా ఉత్పన్నమైన మీథేన్ గ్యాస్ తీవ్రంగా పేరుకుపోయింది. ఈ విషవాయువును బయటకు వెంటేసే (Venting) క్రమంలో ఊహించని విధంగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కొండచరియలు, రాళ్లు విరిగిపడి టన్నెల్ ప్రవేశ మార్గం పూర్తిగా పూడిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో కొందరు చాకచక్యంగా బయటకు పరుగులు తీయగా, 18 మందికి పైగా కార్మికులు లోపలే చిక్కుకుపోయారు.
Sikkim Tunnel Blast: యుద్దప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్
సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF), సిక్కిం పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. టన్నెల్ లోపల దట్టంగా అలుముకున్న మీథేన్ వాయువు, తీవ్రమైన ఆక్సిజన్ కొరత మరియు వెలుతురు లేకపోవడం వల్ల ప్రారంభంలో రెస్క్యూ సిబ్బందికి శ్వాస తీసుకోవడం కష్టమై అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా పశ్చిమ బెంగాల్ నుంచి గ్యాస్ ప్రొటెక్షన్ గేర్లు ఉన్న అధునాతన బృందాలను రప్పించారు. మాస్క్‌లు, ప్రత్యేక పరికరాలతో లోపలికి వెళ్లి చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్‌లు శ్రమిస్తున్నాయి.
ప్రియుడిని చంపిన భార్యాభర్తలు.. వాయిస్‌మెయిల్ ద్వారా నేరాంగీకారం

