Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలో లోకేష్ తన డ్రెస్సింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఎప్పుడూ తెల్ల చొక్కా, సాధారణ ప్యాంటుతో సింపుల్‌గా కనిపించే లోకేష్, ఈసారి అందుకు భిన్నంగా పూర్తి ప్రొఫెషనల్ లుక్‌లో దర్శనమిచ్చారు.

