Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సినీ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మృతి: వైఎస్ జగన్ సంతాపం

సినీ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మృతి: వైఎస్ జగన్ సంతాపం

వార్త 2 months ago

YS Jagan: సినీ విశ్లేషకుడు, నిర్మాత మరియు నటుడు త్రిపురనేని చిట్టిబాబు గారి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

చిట్టిబాబు గారి మరణం సినీ పరిశ్రమకు ఒక తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు.ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, భగవంతుడు వారికి ఈ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ప్రసాదించాలి అని, వైఎస్ జగన్ పేర్కొన్నారు..

Read Also:Jawan 2 Movie Update: లోడింగ్ 'జవాన్-2'.. అట్లీ కథకు షారుఖ్ గ్రీన్ సిగ్నల్!

YS Jagan: త్రిపురనేని చిట్టిబాబు ప్రస్థానం

బుధవారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైటెక్ సిటీ కొండాపూర్‌ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడే కొద్దిసేపటి క్రితం చిట్టిబాబు తుదిశ్వాస విడిచారు. ఆయన గుండె పోటుతో మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. చిట్టిబాబు ఆకస్మిక మరణం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

చిట్టిబాబు తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో బహుముఖ ప్రజ్ఞ కనబరిచారు. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిట్టిబాబు తొలినాళ్లలో ఆత్రేయ, అప్పలాచార్య వంటి దిగ్గజాల వద్ద సహ రచయితగా పనిచేశారు. అనంతరం దర్శకుడిగా మారారు.'సంతానం'సినిమాతో దర్శకుడిగా మారారు.ఇలా దాదాపు 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు.అలాగే 49 సినిమాలకు కో-డైరెక్టర్‌గా వ్యవహరించారు. అంతేకాదు సుమారు 30కి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా ప్రేక్షకులను మెప్పించారు.

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA),ఇతర సినీ యూనియన్లలో ఆయన చాలా యాక్టివ్‌గా ఉండేవారు. తోటి కళాకారుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ముందుండేవారు. ఇటీవలి కాలంలో చిట్టిబాబు ఒక సినీ విశ్లేషకుడిగా (Film Analyst) తెలుగు ప్రేక్షకుల మధ్య చర్చల్లో ఉండేవారు. సినిమాల విజయవకాశాలు, ట్రెండ్స్, సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లపై టీవీ చర్చల్లో ఆయన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. ఆయన విశ్లేషణలు ఆలోచనాత్మకంగా,వాస్తవానికి దగ్గరగా ఉండేవని పరిశ్రమ వర్గాలు చెబుతుంటాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha