Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సినీ రంగానికి విజయ్ గిఫ్ట్.. విశాల్ ఎమోషనల్ పోస్ట్

సినీ రంగానికి విజయ్ గిఫ్ట్.. విశాల్ ఎమోషనల్ పోస్ట్

వార్త 2 weeks ago

CM Vijay : తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైన తర్వాత ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సినీ పరిశ్రమకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలకు తొలి ఏడు రోజులు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ నిర్ణయంతో కోలీవుడ్ పరిశ్రమలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

థియేటర్లకు పెద్ద ఊరటనిచ్చిన నిర్ణయం

ఇప్పటివరకు అమల్లో ఉన్న కఠిన నిబంధనలను సవరించిన ప్రభుత్వం, నిర్మాతలు లేదా థియేటర్ యాజమాన్యాలు ప్రత్యేక అనుమతులు తీసుకోకుండా ఐదో షో ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది. పండుగలు, వారాంతాల్లో కూడా ఈ అనుమతి కొనసాగనుంది. ఇటీవల చిత్ర పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసి సమస్యలను వివరించగా, వెంటనే స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

విజయ్‌ను ప్రశంసించిన విశాల్

ప్రభుత్వ నిర్ణయంపై నటుడు, నిర్మాత విశాల్ సోషల్ మీడియాలో స్పందించారు. "సామాన్యుల ఆరాధ్య (CM Vijay) నాయకుడు విజయ్" అంటూ ఆయనను ప్రశంసించారు. సినీ పరిశ్రమ కష్టాలను అర్థం చేసుకుని సరైన సమయంలో గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఈ నిర్ణయం చిన్న సినిమాలకు పెద్ద ఊరటనిస్తుందని, థియేటర్ల నిర్వహణకు కూడా ఉపయోగపడుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బంగ్లాదేశీ వలసదారులకు బెంగాల్ సీఎం వార్నింగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha