Vijay: దక్షిణాది రాజకీయ యవనికపై ఒక కొత్త ధ్రువతార ఉదయించింది. వెండితెరపై దళపతిగా కోట్లాది మంది నీరాజనాలు అందుకున్న విజయ్, ఇప్పుడు తమిళగ 'వెట్రి కళగం (టివికె) సారథిగా చెన్నై సెయింట్ జార్జ్ కోటపై జెండా ఎగురవేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం భారత రాజకీయ చరిత్రలో మరో అద్భుత ఘట్టం.
గ్లామర్ గెలుపుగా మారడం దక్షిణాదికి కొత్త కాకపోయినా, ఈ ప్రయాణం వెనుక ఉన్న పోరాటం, గతంలో సినీ రంగం నుండి వచ్చి విఫలమైన నేతల నీడలు, మారుతున్న వార సత్వ రాజకీయాల పోకడలు ఈ విజయాన్ని మరింత అర్థవంతం చేస్తున్నాయి. తమిళనాడు రాజకీయ చరిత్రను ఒకసారి సింహావలోకనం చేస్తే, 1977లో ఎంజీఆర్ సాధిం చిన విజయం ఒక పాఠం వంటిది. అప్పట్లో ఎంజీఆర్ నేతృత్వంలోని ఏఐఏడీఎంకే.. సీపీఎం, ఏఐఎఫ్బీ, ముస్లిం లీగ్ వంటి పార్టీలతో ప్రీపోల్ అలయన్స్ (ముందస్తుపొత్తు) కుదుర్చుకొని ఎన్నికల బరిలోకి దిగింది. ఆనాడు ఎంజీఆర్ చరిష్మా ఎంతలా పనిచేసిందంటే, పొత్తులు ఉన్నప్పటికీ ఏఐఏడీఎంకే ఒంటరిగానే స్పష్టమైన మెజారిటీ సాధించి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సరిగ్గా ఐదు దశాబ్దాల తర్వాత, నేడు విజయ్కూడా అదే తరహాలో సినిమా గ్లామర్తో రాజకీయాల్లోకి వచ్చినా, ప్రయాణం కొంత భిన్నంగా సాగింది.
Read Also: TN CM Vijay: తమిళనాడులో మందు కొనాలంటే ఆధార్ తప్పనిసరి
Vijay
Vijay: సినీ ప్రభావం
ఒంటరిగా పోటీచేసి ఎన్నికల్లో మెజారిటీకి కూతవేటుదూరంలో నిలబడిన విజయ్కమారు తున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకేలతో పోస్ట్పెల్ అలయన్స్ (ఎన్నికల తర్వాతి పొత్తు కుదుర్చుకొని అధికార పగ్గాలు చేపట్టడం ఒక సరికొత్త వ్యూహం. నిజానికి తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రభావం ఎంజీఆర్తోనే మొదలుకా లేదు. ఆయనకు ప్రత్యర్థి అయిన కరుణానిధి సైతం అద్భుతమైన సినీ రచ యితగా, తన కలం బలంతోనే ద్రవిడ సిద్ధాంతాలను ప్రజల్లో కి తీసుకెళ్లి ఐదుసార్లు ముఖ్యమంత్రి కాగలిగారు. దక్షిణాది లో సినీ గ్లామర్ పొలిటికల్ పవర్గా మారిన తీరుకుఎన్టీఆర్ ప్రస్థానం ఒకనిలువుటద్దం. 1982లో తెలుగుదేశం ఆవిర్భా వం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనేకాక జాతీయ స్థాయిలోనూ భూకంపం సృష్టించింది. కేవలం 9నెలల్లోనే అధికారంలోకి రావడమే కాకుండా, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక భూమిక పోషించి, ప్రాం తీయ పార్టీలన్నీ ఏకమై కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవని ఎన్టీఆర్ నిరూపించారు. ఆయన చూపిన ఆ బాటలోనే తర్వాతి కాలంలో జయలలిత సైతం జాతీయ రాజకీయాలను శాసించగలిగారు. జయలలిత కేవలం నటిగా మాత్రమే కాకుండా, ఆంగ్ల భాషపై తనకున్న అద్బుతమైన పట్టుతో రాజ్యసభలో చేసిన ప్రసంగాలు జాతీయ నాయకులను సైతం ఆకర్షించేవి.
Vijay
సెలబ్రిటీల కంటే సిద్దాంతాలకే పెద్దపీట
ఈగ్లామర్ రాజకీయం కేవలం నటులకే పరిమితం కాలేదు. సినీ రంగానికున్న ప్రజాకర్షణ శక్తిని గుర్తించి, రాజకీయ వారసులు సైతం వెండితెరనే తమతొలి వేదికగా ఎంచుకుంటున్నారు. కర్ణాటక మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు నిఖిల్ కుమారస్వామి, తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధిస్టాలిన్ వంటి వారు సినిమాలద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయ త్నంచేయడం ఈగ్లామర్ ప్రభావానికి నిలువుటద్దం. అయితే, వెండితెర ఇమేజ్ ఉంటేచాలు అధికారం దక్కుతుందనేభ్రమ ను గతంలో అనేక ఉదాహరణలు పటాపంచలు చేశాయి. తమిళనాడులో విజయకాంత్, కమలహాసన్ వంటి వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు నేటికీ చర్చనీయాంశమే. ఈ వైఫల్యాల మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కింగ్ మేకర్గా ఎదగడం, ఉపముఖ్య మంత్రి కావడం ఒక కొత్త మలుపు. మరోవైపు, కేరళలో సినీగ్లామర్ రాజకీయం ఇప్పటికీ ప్రభావం చూపకపోవడం గమనార్హం. అక్కడ ఓటర్లు సెలబ్రిటీల కంటే సిద్దాంతాలకే పెద్దపీట వేస్తారు. దీన్నిబట్టి అర్థమయ్యేదేమిటంటే రాజకీయాల్లోకి సినీ గ్లామర్ తోనే వచ్చినా, ప్రజాప్రయోజనాలకు చిత్తశుద్ధితో కృషిచేసిన వారుమాత్రమే నిలదొక్కుకుంటారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి వారు ప్రజాహిత మైన పథకాలను రూపొందించి, రాజకీయ వ్యూహాలను వంటబట్టించుకున్నారు కాబట్టే పది కాలాలపాటు ప్రజా దరణ పొందగలిగారు. విజయ్ విజయం ఈ నేపథ్యాల న్నింటినీ దాటుకుని వచ్చింది. తన అభిమాన సంఘాలను ఒక క్రమశిక్షణ కలిగిన రాజకీయ దళంగా మార్చడం విజయ్ సాధించిన అతిపెద్ద విజయం.
-మర్రాపు వసుంధరా దేవి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

