Euphoria Movie OTT: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన విభిన్న చిత్రం 'యుఫోరియా' (Euphoria) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.
థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సామాజిక ఇతివృత్తం, డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.ఈ మూవీ లో, భూమిక, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. కాగా, ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీలో ఏప్రిల్ 2 (గురువారం) నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో గుణశేఖర్ పరిశ్రమ తీరుపై తన ఆవేదనను పంచుకున్నారు.
Read Also: Telangana backdrop : తెలంగాణ కథతో సుకుమార్ నిర్మాణంలో సినిమా
అవార్డుల పంట.. కానీ బాక్సాఫీస్ వద్ద నిరాశ
'యుఫోరియా' కేవలం సినిమా మాత్రమే కాదని, ఇదొక అంతర్జాతీయ స్థాయి సబ్జెక్ట్ అని గుణశేఖర్ పేర్కొన్నారు.ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం రెండు ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించింది. ఉత్తమ కథా రచయితగా గుణశేఖర్, ఉత్తమ సహాయ నటిగా భూమిక అవార్డులు అందుకున్నారు.సమాజంలోని నగ్న సత్యాన్ని (Naked Truth) నిర్భయంగా చెప్పడం వల్లే కొన్ని ఓటీటీ సంస్థలు ఈ సినిమాను కొనేందుకు సంశయించాయని ఆయన వెల్లడించారు. 'ప్రతిఘటన', 'చిత్రం' వంటి సినిమాల స్ఫూర్తితోనే ఈ కథను తెరకెక్కించినట్లు తెలిపారు.
Gunasekhar Euphoria ETV Win
Euphoria Movie OTT: సినిమా పరిశ్రమదే పెద్ద తప్పు!
కోవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి సినిమా పరిశ్రమ తీసుకున్న నిర్ణయాలే కారణమని గుణశేఖర్ విశ్లేషించారు.సినిమా విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుందని ప్రేక్షకులకు అలవాటు చేసేశామని, అందుకే వారు చిన్న సినిమాల కోసం థియేటర్లకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.థియేటర్ల మనుగడ సాగాలంటే, సినిమా విడుదలైన తర్వాత కనీసం మూడు నెలల వరకు ఓటీటీలోకి రాకూడదని, అప్పుడే ఆడియన్స్ థియేటర్లకు వస్తారని ఆయన చెప్పారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

