Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సినిమాల్లోకి బాలకృష్ణ కూతురు?

సినిమాల్లోకి బాలకృష్ణ కూతురు?

వార్త 3 weeks ago

Balakrishna : నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని త్వరలోనే వెండితెరపై మెరవబోతున్నారనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే పలువురు హీరోలు వచ్చి టాలీవుడ్‌లో తమ ముద్ర వేయగా, ఇప్పుడు తొలిసారిగా ఆ కుటుంబం నుంచి ఒక నటి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. అందుతున్న కథనాల ప్రకారం.. ఆమె ఒక విలక్షణమైన స్పోర్ట్స్ డ్రామా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కథా చర్చలు (Story Discussions) శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఈ విషయామై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

కమర్షియల్ హంగులకు దూరంగా.. సందేశాత్మక చిత్రంతో ఎంట్రీ!

ఈ సినిమా కేవలం రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా, సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే రీతిలో రూపుదిద్దుకోనుండటం విశేషం. క్రీడా నేపథ్యంతో కూడిన ప్రాధాన్యత ఉన్న పాత్ర ద్వారా తన నటనను నిరూపించుకోవాలని తేజస్విని భావిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె డాన్స్ చేస్తున్న వీడియోలు బాగా వైరల్ కావడం, నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. నందమూరి అభిమానులు సైతం తేజస్విని సినీ రరంగేట్రంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్పైడర్ మ్యాన్ బ్రాండ్ రివ్యూ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha