Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SIR వల్లే బెంగాల్ లో బీజేపీకీ భారీ మెజార్టి: శశిథరూర్

SIR వల్లే బెంగాల్ లో బీజేపీకీ భారీ మెజార్టి: శశిథరూర్

వార్త 2 weeks ago

West Bengal: పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ 15 సంవత్సరాలు ఏకదాటికి పరిపాలించారు. కమ్యూనిస్టుల పాలన నుంచి హస్తగతం చేసుకున్న మమత మూడుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు.

అయితే ఆమె పాలనలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని బీజేపీ నిత్యం విమర్శిస్తూ, దాన్నే ప్రధాన అస్త్రంగా మార్చుకుని చేసిన ఎన్నికల ప్రచారంలో అత్యున్నత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో పశ్చిమ బెంగాల్ లో మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. భారీ మెజార్టిలో గెలుపొందిన బీజేపీ తనకు తిరుగులేదని నిరూపించింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read Also : AIADMKలో విభేదాలు తెచ్చిన విజయ్ మద్దతు !

West Bengal: ఓట్ల తొలగింపు మధ్య లింక్!

West Bengal: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో జరిగిన అవకతవకలే బెంగాల్ లో బీజేపీ గెలుపునకు ప్రధాన కారణమని శశి థరూర్ ఆరోపించారు. 34లక్షల మంది అప్పీల్ చేసుకున్నారు. పశ్చిమబెంగాల్ లో ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 91లక్షల పేర్లను తొలగించారు. వారిలో తాము జీవించి ఉన్నామని, ఓటు హక్కుకు అర్హులమని చెబుతూ 34లక్షల మంది అప్పీళ్లు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి కేసును విడివిడిగా విచారించాలి. కానీ ఎన్నికలకు ముందు కేవలం కొన్ని వందల కేసులను మాత్రమే పరిష్కరించి, దాదాపు 31-32 లక్షలమంది అప్పీళ్లు పెండింగ్ లోనే ఉన్నాయి అని శశిథరూర్ ఆరోపించారు. ఈ గణాంకాలను జీపేపీ గెలుపు మార్జిన్ తో పోల్చి చూపిస్తూ థరూర్ కీలకమైన ప్రశ్నను లేవనెత్తారు. బెంగాల్ లో బీజేపీ సుమారు 30 లక్షల ఓట్ల ఏడాతో గెలిచింది. ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయన వారి సంఖ్య కూడా దాదాపు అంతే ఉంది. ఇప్పుడు చెప్పండి,, ఇది పూర్తిగా న్యాయమైన, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రక్రియేనా? ఇదే నా ప్రశ్న అని శశిథరూర్ ప్రశ్నించారు.

అర్హులైన ఓట్లను తొలగించడం ఆందోళనకరం వలస వెళ్లిన వారు, మరణించిన ఓటర్లను, నకిలీ ఓట్లను తొలగించడం తప్పుకాదని, కానీ లక్షలాదిమంది అర్హులైన ఓటర్లు తమ హక్కును కోల్పోవడమే ఆందోళనకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కేరళలో ఓటర్ల జాబితా సవరణవల్ల తమ కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కేరళ, తమిళనాడులో బెంగాల్ లా లక్షల్లో కాకుండా ఓటు పునరుద్ధరణ కోసం కేవలం కొన్ని వందల అప్పీళ్లు మాత్రమే వచ్చాయని థరూర్ పేర్కొన్నారు. బీజేపీ ఈసారి ఏవిధంగానైనా మమతాను ఓడించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో పశ్చిమబెంగాల్ లో గత నెలరోజులుగా కేంద్ర మంత్రులు, స్థానిక నాయకులతో సమన్వయం చేస్తూ, వ్యూహాత్మంగా పావులు కదుపువచ్చారు. భారీగా ఓటర్లు ఓటు చేసేలా పురికొల్పి, విజయాన్ని పొందారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

సీఎం విజయ్‌పై స్టాలిన్ ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha