Citadel Season 2: హాలీవుడ్ స్పై థ్రిల్లర్ సిరీస్ 'సిటాడెల్' (Citadel) రెండో సీజన్‌తో మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సందడి చేసేందుకు ప్రియాంక చోప్రా సిద్ధమైంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసిన తాజా ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్ ట్రైలర్ మరియు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది.
Read Also: MRP Movie Teaser: నవ్వులే నవ్వులు.. 'MRP: నీకెంత? నాకెంత?' టీజర్ టాక్ అదిరిపోయింది
Citadel Season 2: Citadel Season 2.. Trailer is out
Citadel Season 2: తాజా ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను విడుదల చేస్తూ, 2026 మే 6న అన్ని ఎపిసోడ్లను ఒకేసారి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.నాడియా సిన్హ్ పాత్రలో ప్రియాంక చోప్రా తన అదిరిపోయే స్టంట్స్‌తో మరోసారి మెప్పించబోతోంది. మేసన్ కేన్ (రిచర్డ్ మాడెన్), బెర్నార్డ్ ఓర్లిక్ (స్టాన్లీ టుక్కీ)తో కలిసి సరికొత్త మిషన్‌ను ఎలా ఎదుర్కొన్నారనేది ఈ సీజన్ కథాంశం.
ఈ సీజన్లో కొత్తగా జాక్ రేనర్, మ్యాట్ బెర్రీ వంటి హాలీవుడ్ నటులు చేరారు. రూసో బ్రదర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సిరీస్ కోసం ఇండియన్ ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఎందుకంటే ప్రియాంక తన హాలీవుడ్ కెరీర్‌లో ఈ పాత్రతోనే అత్యధిక క్రేజ్ సంపాదించుకున్నారు.
గ్లోబల్ ప్రాజెక్ట్‌లతో ప్రియాంక జోరు
ప్రస్తుతం ప్రియాంక చోప్రా తన కెరీర్‌లోనే అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఒకవైపు హాలీవుడ్‌లో ‘సిటాడెల్’తో సత్తా చాటుతూనే, మరోవైపు భారతీయ సినిమాల్లోనూ నటిస్తోంది. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా 'వారణాసి' (SSMB29) షూటింగ్‌లో ఆమె పాల్గొంటుండటం విశేషం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
నీలి రంగులో నిగనిగలాడుతున్న శివాని.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్

