Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సీవీ ఆనంద్'.. ఏ శాఖలోనైనా తిరుగులేని ముద్ర సొంతం

'సీవీ ఆనంద్'.. ఏ శాఖలోనైనా తిరుగులేని ముద్ర సొంతం

వార్త 1 month ago

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం కావడం పోలీస్ వర్గాల్లోనే కాక రాజకీయ, సామాజిక వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది. ఒక ఐపీఎస్ అధికారిగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) స్థాయి నుండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) స్థాయి వరకు ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఏ బాధ్యత అప్పగించినా అందులో తనదైన ముద్ర వేయడం ఆయన ప్రత్యేకత. సీవీ ఆనంద్ గారి పనితీరు, ఆయన సాధించిన విజయాలు అమోగం. సీవీ ఆనంద్ సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో వివిధ కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో నగరంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయం. ఉత్సవాలు, పండుగల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడంలో ఆయనకు మంచి పట్టుంది. అలాగే ఏసీబీ (ACB) డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు అవినీతి తిమింగలాలపై ఆయన ఉక్కుపాదం మోపారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేయడంలోనూ, క్షేత్రస్థాయిలో క్రమశిక్షణను పెంచడంలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు.

Read Also ; Bengaluru Crime: తాళం వేసిన ఇంట్లో యువతి నగ్న మృతదేహం.. హత్యేనా?

ఐఏఎస్ పోస్టులో ఐపీఎస్ మార్క్

సాధారణంగా ఐఏఎస్ అధికారులు నిర్వహించే పౌరసరఫరాల శాఖ (Civil Supplies) కమిషనర్ బాధ్యతలను గతంలో ప్రభుత్వం సీవీ ఆనంద్‌కు అప్పగించింది. ఒక ఐపీఎస్ అధికారిని ఈ పోస్టులో నియమించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఆయన తన పనితీరుతో అందరి నోళ్లు మూయించారు. పౌరసరఫరాల శాఖలో పేరుకుపోయిన అవినీతిని ఏరిపారేయడానికి ఆయన టెక్నాలజీని పెద్దపీట వేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలోనూ, లూప్‌హోల్స్‌ను కనిపెట్టి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలగకుండా చూడటంలోనూ ఆయన అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఏ శాఖలో పని చేసినా అది తన మార్క్ సంస్కరణలతో కొత్త రూపు సంతరించుకుంటుందని ఆయన నిరూపించారు.

డీజీపీగా కొత్త బాధ్యతలు.. ప్రభుత్వం నమ్మకం

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వం అన్ని విధాలా ఆలోచించి సీవీ ఆనంద్ వైపే మొగ్గు చూపింది. ఆయనకున్న అపారమైన అనుభవం, గడ్డు కాలంలో కూడా సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోగల శక్తి సామర్థ్యాలే ఆయనను డీజీపీ పీఠంపై కూర్చోబెట్టాయి. పోలీసు శాఖలో అన్ని హోదాల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో కింది స్థాయి సిబ్బంది సమస్యలను అర్థం చేసుకుంటూనే, ఉన్నత స్థాయి లక్ష్యాలను చేరుకోవడంలో ఆయన సక్సెస్ అవుతారని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ఇప్పుడు డీజీపీగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకువస్తారని అంతా ఆశిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మెదక్ హైవేపై ఘోర ప్రమాదం.. 15 మందికి తీవ్రగాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha