Dailyhunt
స్కామ్ వివాదంపై నోరువిప్పిన సింగర్ మంగ్లీ

స్కామ్ వివాదంపై నోరువిప్పిన సింగర్ మంగ్లీ

వార్త 1 week ago

నపై ఆరోపణలు చేసిన అడ్వకేట్ సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సదరు వ్యక్తి తనను డబ్బు డిమాండ్ చేశారని, అది ఇవ్వనందుకే కక్షపూరితంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

కేవలం రాబోయే బిగ్ బాస్ షోలో అవకాశం కోసమే ఆయన ఇదంతా చేస్తున్నారని మంగ్లీ పేర్కొన్నారు. తన పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు పాల్పడితే తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో చట్టపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేస్తూ పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేశారు.

Read Also : TG Inter Results 2026: ఫెయిల్ అవుతానన్న భయంతో ఆత్మహత్య.. కానీ పాసయ్యాడు!

మంగ్లీ సవాల్

రాజకీయ ప్రచారాల ద్వారా కోట్లు సంపాదించే అవకాశాలు వచ్చినా, కేవలం తన విలువలను కాపాడుకోవడానికే వాటిని వదులుకున్నానని మంగ్లీ భావోద్వేగంగా స్పందించారు. తనకు డబ్బు కంటే వ్యక్తిత్వమే ముఖ్యమని, ఈ స్కామ్‌లో తన ప్రమేయం ఉందని ఏ చిన్న ఆధారం దొరికినా ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆమె బహిరంగ సవాల్ విసిరారు. తనకు సంబంధం లేని వ్యక్తులను తన తమ్ముడని ప్రచారం చేయడం మానుకోవాలని, ఇలాంటి అక్రమ ఆరోపణలను తాను అస్సలు ఉపేక్షించబోనని ఘాటుగా హెచ్చరించారు.

బాధితుల పక్షాన పోరాటం

ఈ వివాదంలో బాధితులకు న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని మంగ్లీ హామీ ఇచ్చారు. తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని చూసే వారిపై చట్టపరమైన పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు. మంగ్లీ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. నిజానిజాలు తేలే వరకు తనపై అసత్య ప్రచారాలు చేయవద్దని ఆమె అభిమానులను మరియు మీడియాను కోరారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పెళ్లితో క్యాన్సర్ దూరం.. అధ్యయనంలో వెల్లడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha