Hi-tech City DCM Accident: హైదరాబాద్‌లోని ఐటీ హబ్ హైటెక్ సిటీలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాదాపూర్ మైండ్‌స్పేస్ పరిసరాల్లో మితిమీరిన వేగంతో వచ్చిన ఒక డీసీఎం (DCM) వాహనం దంపతులు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టి, ఐదు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
Read Also:Nirmal Fridge Short Circuit: ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు దుర్మరణం!
Hi-tech City DCM Accident: ప్రమాదం జరిగిన తీరు
మాదాపూర్ మైండ్‌స్పేస్ వద్ద వేగంగా వచ్చిన డీసీఎం వీరి స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి స్కూటీ డీసీఎం కింద ఇరుక్కుపోయింది.ప్రమాదం జరిగిందని తెలిసినా డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అలాగే వేగంగా జూబ్లీహిల్స్ వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. మలబార్ బంగారం షాపులో పని చేస్తున్నారు భార్యాభర్తలు. కూకట్‌పల్లిలో సినిమా చూసి మహేశ్వరం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భర్త పేరు అబ్దుల్ బాసిత్ కాగా, ఆమె భార్య పేరుహానియా అయేషా.
Hyderabad Road Accident Today
ఈ ఘటనను, గమనించిన కొందరు వ్యక్తులు డీసీఎం వాహనాన్ని వెంటాడి మరీ అడ్డుకున్నారు. ప్రజలను గమనించిన డ్రైవర్ వాహనాన్ని వదలి అక్కడి నుంచి పారిపోయాడు. క్లీనర్ అడ్డంగా దొరికిపోయాడు. ఆగ్రహంతో రెచ్చిపోయిన స్థానికులు కోపోద్రిక్తులైన స్థానిక ప్రజలు సహాయకుడిని చితకబాదారు.ఘటన గురించి తెలియగానే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వాహనం క్లీనర్‌ని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసిన పోలీసులు, వివరాలు సేకరిస్తున్నారు.నెంబర్ ప్లేట్ ఆధారంగా డీసీఎం వాహనం ఎవరిది? అనేదానిపై ఆరా తీస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
ప్రేమించి పెళ్లాడిన భార్యను చంపి.. ఆత్మహత్యగా కట్టుకథ అల్లిన భర్త!

