Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్మార్ట్ రేషన్ కార్డు.. మీ వివరాలు చెక్ చేసుకోండిలా

స్మార్ట్ రేషన్ కార్డు.. మీ వివరాలు చెక్ చేసుకోండిలా

వార్త 1 week ago

Smart Ration Card : తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది.

పారదర్శకమైన సేవలు అందించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అర్హుల జాబితాలో పేర్లు నమోదైన వినియోగదారులకు మాత్రమే ఈ స్మార్ట్ కార్డులను అందజేస్తారు. ఈ డిజిటల్ కార్డుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ మరింత సులభతరం కానుంది.

రేషన్ కార్డు స్టేటస్, వివరాలు చెక్ చేసుకునే విధానం

మీ పేరు స్మార్ట్ రేషన్ కార్డుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి పౌరసరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ హోమ్ పేజీలో కనిపించే ‘FSC Search’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం మీ పాత రేషన్ కార్డు నంబర్ లేదా FSC రిఫరెన్స్ నంబర్‌ను నమోదు చేసి, సంబంధిత జిల్లాను ఎంపిక చేసుకుని సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై మీ కుటుంబ సభ్యుల వివరాలు, కార్డు ప్రస్తుత స్టేటస్, మీకు కేటాయించిన రేషన్ షాప్ మరియు డీలర్ వివరాలు పూర్తి స్థాయిలో కనిపిస్తాయి.

కేసీఆర్ ..మాకు సలహాలు ఇవ్వండి - రేవంత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha