Snapchat scam: విజయవాడలో సోషల్ మీడియా వేదికగా జరిగిన ఓ భారీ సైబర్ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న స్వర్ణ మాల్య అనే యువతికి సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ ద్వారా గౌతం నాయుడు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం క్రమంగా మాటలు కలవడానికి దారితీసింది. తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయానని నిందితుడు ఆ యువతిని నమ్మించాడు.

బెదిరింపుల పర్వం – కోటిన్నరకు పైగా వసూలు
బాధితురాలి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు, వివిధ సందర్భాల్లో ఆమె నుంచి విడతలవారీగా రూ.1.50 కోట్లకు పైగా డబ్బులు గుంజాడు. ఆ తర్వాత మరింత డబ్బు కోసం ఒత్తిడి తేవడమే కాకుండా, ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమెను మానసికంగా బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. నిందితుడి వేధింపులు మితిమీరడంతో భయాందోళనకు గురైన బాధితురాలు మోసపోయినట్లు గ్రహించింది.
Snapchat scam: పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు – దర్యాప్తు షురూ
నిందితుడి బెదిరింపులతో తీవ్ర మానసిక క్షోభకు గురైన స్వర్ణ మాల్య చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Raed also

