Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సోల్జర్ 24×7 ఆన్ డ్యూటీ' ఫస్ట్ లుక్ విడుదల!

'సోల్జర్ 24×7 ఆన్ డ్యూటీ' ఫస్ట్ లుక్ విడుదల!

వార్త 3 weeks ago

Konanki Karthik movie: కోనంకి కార్తీక్ లీడ్ రోల్‌లో నటిస్తున్న సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సోల్జర్ 24×7 ఆన్ డ్యూటీ'. శ్రద్ధ ఖత్రి దర్శకత్వంలో కె.

వి. నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. విభిన్నమైన పోస్టర్‌తో వచ్చిన ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సినిమా లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Read Also : Bhagyaraj Final Rites : ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి

 ‘Soldier 24×7 On Duty’ First Look Released!

Konanki Karthik movie: పవర్ఫుల్ లుక్‌లో కోనంకి కార్తీక్

విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో కోనంకి కార్తీక్ అత్యంత పవర్ఫుల్ సైనికుడి పాత్రలో కనిపిస్తూ అలరించాడు. యుద్ధ వాతావరణం, తీవ్రమైన పోరాట ఛాయలు, వాటి మధ్య గర్వంగా రెపరెపలాడుతున్న భారత త్రివర్ణ పతాకం బ్యాక్‌డ్రాప్‌లో డిజైన్ చేసిన కార్తీక్ లుక్ సినిమాపై ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. ఈ చిత్రంలో ప్రియాంక వర్మ కథానాయికగా నటిస్తోంది.

దేశభక్తి, ధైర్యం, త్యాగం, కర్తవ్య నిబద్ధతకు ప్రతీకగా ఈ చిత్రం రూపొందుతోందని చిత్ర మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తూ, దేశ భద్రత కోసం అహర్నిశలు కృషిచేసే భారత సైనికులకు ఈ చిత్రం ఒక ఘన నివాళిగా నిలవనుందని వారు పేర్కొన్నారు. ఆర్మీ జవాన్ల నిజ జీవిత పోరాటాలను, వారి దేశభక్తిని కళ్లకు కట్టేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకురాలు శ్రద్ధ ఖత్రి నమ్మకం వ్యక్తం చేశారు.

లండన్‌లో 'పెద్ది' చిత్ర విజయోత్సవ వేడుకలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha