Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోనీలివ్‌లో 'మధువిధు' మూవీ రివ్యూ!

సోనీలివ్‌లో 'మధువిధు' మూవీ రివ్యూ!

వార్త 2 days ago

Madhuvidhu Movie: సాధారణంగా మలయాళ సినీ పరిశ్రమ నుంచి అనగానే ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ చిత్రాలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. ఈ సినిమాలపై మలయాళ మేకర్స్ చూపే పట్టు అంతా ఇంతా కాదు.

అయితే, అదే ఇండస్ట్రీ నుంచి ఈ వారం ఒక ఆహ్లాదకరమైన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమానే ‘మధువిధు’. విష్ణు అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 23వ తేదీన థియేటర్లలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. షరాఫుద్దీన్, కల్యాణి పణిక్కర్ ప్రధాన జంటగా నటించిన ఈ సినిమా, మే 22వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సోనీలివ్’ (SonyLIV) లో తెలుగుతో పాటు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : Ram Charan Political Entry: రామ్ చరణ్ రాజకీయ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ!

 Madhuvidhu Movie Review

కథ

విషయానికి వస్తే.. కేరళలోని ఎర్నాకులం పరిధిలో ఉన్న ‘కొచ్చాంబళం’ అనే ఒక అందమైన గ్రామంలో రాజ్ కుమార్ కుటుంబం నివసిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో రాజ్ కుమార్, అతని తమ్ముడు అంబరీష్, కొడుకులు అమృత రాజ్ (షరాఫుద్దీన్), విమల్ రాజ్ (అమల్ జోస్) కలిసి ఉంటారు. రాజ్ కుమార్ భార్య సరోజిని చనిపోయినప్పటి నుంచి ఆ ఇంట్లోకి మరో ఆడమనిషి కాలు పెట్టదు. అమృత్ రాజ్ ఒక కేఫ్ నడుపుతుండగా, తమ్ముడు విమల్ రాజు యూట్యూబర్‌గా, బాబాయ్ కేబుల్ టీవీ బిజినెస్‌తో బిజీగా ఉంటారు. అయితే ఆ ఇంటికి ‘నాగదోషం’ ఉందనే ప్రచారం ఊళ్లో బలంగా సాగడంతో, ఆ ఇంట్లోని మగాళ్లెవరికీ పెళ్లి సంబంధాలు కుదరవు. దీంతో వారంతా పెళ్లిపై ఆశలు వదులుకుని, వంతుల వారీగా వంటలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు.

అదే ఊళ్లో మార్కోస్ (శశి కుమార్) అనే వ్యక్తికి స్నేహ (కల్యాణి పణిక్కర్), సోఫియా (అనుశ్రేయ రాజన్) అనే ఇద్దరు కూతుళ్లు ఉంటారు. అలాగే భర్త చేతిలో మోసపోయిన మార్కోస్ చెల్లెలు మెర్సీ (శ్రీ జయ నాయర్), ఆమె కూతురు ‘మిలి’ కూడా అక్కడే నివసిస్తుంటారు. తన ఇద్దరు కూతుళ్లను జోయెల్, టామ్ అనే అన్నదమ్ములకు ఇచ్చి పెళ్లి చేయాలని మార్కోస్ నిర్ణయిస్తాడు. అయితే, ఊహించని విధంగా అమృత్ రాజ్ – స్నేహ ఇద్దరూ ప్రేమలో పడతారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఇరు కుటుంబాలను ఒప్పిస్తారు. అమృత్ రాజ్, స్నేహల పెళ్లి పనులు జరుగుతున్న తరుణంలో.. స్నేహ మేనత్త మెర్సీని, అమృత్ రాజ్ తండ్రి రాజ్ కుమార్ రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు. ఈ షాకింగ్ సంఘటనతో ఆ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అమృత్, స్నేహల పెళ్లి పీటల వరకు చేరిందా? లేదా? అనేదే మిగతా కథ.

కథనాలు, పాత్రలు

దర్శకుడు విష్ణు అరవింద్ రాసుకున్న కథాకథనాలు, పాత్రల స్వరూప స్వభావాలు చాలా సహజంగా ఉండి ఆకట్టుకుంటాయి. నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతిక పరంగా విశ్వజిత్ ఫొటోగ్రఫీ కేరళ పల్లెటూరి అందాలను చక్కగా చూపించింది. హేషమ్ అబ్దుల్ వాహెబ్ అందించిన సంగీతం, క్రిస్టీ సెబాస్టియన్ ఎడిటింగ్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా సాగాయి.

ముగింపు

పెళ్లి అనేది ఒక పంజరం లాంటిదని భావించే నేటి తరానికి.. పెళ్లి అనేది జీవితాన్ని అందంగా మార్చే ఒక అద్భుతమైన బంధం అనే చక్కని సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుంది. ఎలాంటి హడావుడి లేకుండా, సింపుల్ కంటెంట్‌తో సరదాగా సాగిపోయే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూడాలనుకుంటే.. సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మధువిధు’ను హ్యాపీగా వీక్షించవచ్చు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పెద్ది నుంచి ఐటెం సాంగ్ ప్రోమో విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha