Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సొంత ఇళ్లు లేని వారికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

సొంత ఇళ్లు లేని వారికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

వార్త 2 weeks ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఇల్లు లేని నిరుపేదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పేదలకు ఇళ్ల నిర్మాణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని, గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతల్లో గృహ నిర్మాణం అత్యంత కీలకమైందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

Read Also : రవాణా ఖర్చు తగ్గితేనే ఏపీకి గరిష్ఠ లాభం: చంద్రబాబు

ఇళ్ల స్థలాల పంపిణీకి ముహూర్తం ఖరారు

ఇప్పటికే ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్న 2 లక్షల మంది లబ్ధిదారులకు తక్షణమే స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలను కేటాయించనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, రాజకీయాలకు అతీతంగా నిజమైన పేదలకు న్యాయం జరగాలని అధికారులను కోరారు. ఈ నెలలోనే స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసి, వెంటనే నిర్మాణ పనులు మొదలుపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

PMAY-NTR 2.0: కేంద్రం నుండి లక్ష ఇళ్ల మంజూరు

రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగానికి కేంద్ర ప్రభుత్వం నుండి భారీ మద్దతు లభించనుంది. PMAY-NTR 2.0 స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్‌కు ఈ నెలాఖరులోగా లక్ష ఇళ్లను కేంద్రం మంజూరు చేయనుందని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో, నాణ్యమైన ప్రమాణాలతో ఈ కాలనీలను అభివృద్ధి చేయనున్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల విడుదల మరియు మెటీరియల్ సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించడం గమనార్హం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అమరావతిలో కిమ్స్ ఆసుపత్రి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha