Melodi meme : మోదీ-మెలోని స్నేహబంధంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన 'మెలోడీ' ట్రెండ్ ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల ప్రచారాల్లో కూడా చోటు సంపాదించింది.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ఉన్న అనుబంధాన్ని నెటిజన్లు సరదాగా 'మెలోడీ'గా పిలుస్తూ మీమ్స్ సృష్టించారు. తాజాగా ఈ ట్రెండ్‌ను ఇండియా పోస్ట్ తన స్పీడ్ పోస్ట్ సేవల ప్రచారానికి వినియోగించుకుని సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇండియా పోస్ట్ వినూత్న ప్రచారం
ఇండియా పోస్ట్ తన '#24 స్పీడ్ పోస్ట్' సేవలను ప్రమోట్ చేస్తూ రెండు ప్రత్యేక పోస్టర్లను విడుదల చేసింది. మొదటి పోస్టర్‌లో మెలోడీ టాఫీల ప్యాకెట్ చూపిస్తూ "దీన్ని రేపటికి ఆమెకు ఎలా పంపాలి?" అనే క్యాప్షన్‌తో ఆసక్తి పెంచింది. తర్వాతి పోస్టర్‌లో "మరుసటి రోజుకే చేరవేయడానికి మా #24 స్పీడ్ పోస్ట్ ఉందిగా!" అంటూ చాకచక్యంగా తమ సేవలను ప్రచారం చేసింది. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.
మోదీ గిఫ్ట్‌తో మళ్లీ ట్రెండ్
ఇటీవల ఇటలీ పర్యటనలో ప్రధాని మోదీ, జార్జియా మెలోనికి భారతీయులకి ఎంతో పరిచయమైన పార్లే మెలోడీ టాఫీలను బహుమతిగా అందించారు. దీనికి సంబంధించిన వీడియోను మెలోని సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది గంటల్లోనే కోట్లాది వ్యూస్ సాధించింది. ఈ చిన్న గిఫ్ట్ చుట్టూ సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. నెటిజన్లు దీన్ని "స్వీటెస్ట్ జియోపొలిటికల్ క్రాస్‌ఓవర్"గా అభివర్ణించారు.
Read Also: అమెరికా ఆంక్షలతో సంబంధం లేదు..రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ స్పష్టత
'మెలోడీ' మీమ్ ఆరంభం
2023లో ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సమయంలో మోదీ-మెలోని కలిసి కనిపించిన ఫోటోలు, వీడియోలతో (Melodi meme) ఈ 'మెలోడీ' ట్రెండ్ మొదలైంది. తర్వాత జీ7 సమావేశంలో మెలోని స్వయంగా #Melodi హాష్‌ట్యాగ్ ఉపయోగించడంతో ఇది అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు అదే ట్రెండ్‌ను ఇండియా పోస్ట్ మార్కెటింగ్ కోసం వినియోగించడం ప్రత్యేక చర్చకు దారితీసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
నార్వే పర్యటనలో మోడీ బిజీ బిజీ

