Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఘోర అగ్నిప్రమాదం.. 16 మంది మృతి

సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఘోర అగ్నిప్రమాదం.. 16 మంది మృతి

వార్త 2 weeks ago

Riyadh : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అత్యంత తీవ్రమైన అగ్నిప్రమాదం సంభవించి భారీ ప్రాణనష్టం సంభవించింది. స్థానిక ఒక సోఫా తయారీ ఫ్యాక్టరీ (Sofa Manufacturing Factory)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, అక్కడే పనిచేస్తున్న 16 మంది బంగ్లాదేశ్ వలస కార్మికులు (Migrant Workers) సజీవ దహనమయ్యారు.

ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఘటనా స్థలంలోనే వారు కాలి బూడిదయ్యారు. సమాచారం అందుకున్న బంగ్లాదేశ్ దౌత్య అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. మృతుల పూర్తి వివరాలను సేకరించి, వారి పార్థివ దేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు సౌదీ అధికారులతో కలిసి చర్యలు వేగవంతం చేసినట్లు వెల్లడించారు.

సౌదీలో బంగ్లా వలసదారులు & వారి ప్రాధాన్యత

ఉపాధి నిమిత్తం మిడిల్ ఈస్ట్‌కు వెళ్తున్న వలస కార్మికులలో బంగ్లాదేశీయుల సంఖ్య గణనీయంగా ఉంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో సుమారు 35 లక్షల మంది బంగ్లాదేశ్ పౌరులు వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. వీరంతా తమ కష్టార్జితంతో స్వదేశానికి భారీగా విదేశీ ద్రవ్యాన్ని పంపుతూ, బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతేడాది ఒక్క ఏడాదిలోనే సౌదీలోని బంగ్లా వలసదారులు ఏకంగా 2.7 బిలియన్ డాలర్లను తమ మాతృదేశానికి రెమిటెన్స్‌ రూపంలో పంపడం గమనార్హం. ఈ క్రమంలో ఈ ఘోర అగ్నిప్రమాద ఘటన బంగ్లాదేశ్‌తో పాటు మిడిల్ ఈస్ట్‌లోని వలస కార్మికుల వర్గాల్లో తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన యువ ఇంజనీర్ దుర్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha