Dailyhunt
సౌదీ యువరాజుతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ

సౌదీ యువరాజుతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ

వార్త 3 weeks ago

West Asia Conflict: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్యపరమైన వ్యూహాన్ని వేగవంతం చేశారు. సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మోదీ , మహమ్మద్ బిన్ సల్మాన్ తో శనివారం మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

ప్రాంతీయ భద్రత, ఇంధన సరఫరా, అంతర్జాతీయ నౌకాయానంపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి.

Read Also: FASTag Annual Pass : వాహనాదారులకు బిగ్ అలర్ట్

 PM Modi talks to Saudi Prince MBS

West Asia Conflict: ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల ఖండన

సౌదీ అరేబియాలోని భారతీయులకు నిరంతరం తోడ్పాటు అందిస్తున్నందుకు యువరాజుకు ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమాసియాలోని ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. “సౌదీ యువరాజుతో పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై చర్చించాను. మౌలిక సదుపాయాలపై దాడులను భారత్ వ్యతిరేకిస్తుందని పునరుద్ఘాటించాను” అని మోదీ పేర్కొన్నారు.

పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ పలుమార్లు గల్ఫ్ దేశాధినేతలతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఇరాన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, మలేషియా దేశాధినేతలతో ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఎలక్ట్రిక్ వాహనదారులకు అదిరిపోయే వార్త.. రాయితీలు పొడిగించిన కేంద్రం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha