Soujanya Suicide Letter: కాకినాడకు చెందిన నూకరాజు కుమార్తె సౌజన్య ఆత్మహత్య వ్యవహారంలో ఆ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను ఎవరినీ బెదిరించలేదని నిందితుడు సాదిక్ పోలీసుల ఎదుట తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, సౌజన్య రాసిన ఐదు పేజీల సూసైడ్ లెటర్ (ఆత్మహత్య లేఖ) ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలక ఆధారంగా మారింది.
తన మరణ వాంగ్మూలంలో సాదిక్ తనను ఎంతలా హింసించాడో, మానసికంగా, శారీరకంగా ఎలాంటి నరకం చూపించాడో సౌజన్య ప్రతీ అక్షరంలోనూ ఆవేదనతో వివరించారు.
Read Also : Konda Surekha: మాజీ ఓఎస్డీ సుమంత్ కేసు: పోలీసు కస్టడీలోకి మరో ముగ్గురు నిందితులు
Vijayasai Reddy posted the 5-page letter written by Sowjanya.
సౌజన్యకు ఆమె భర్తతో ఉన్న వ్యక్తిగత సమస్యలను అడ్డం పెట్టుకుని సాదిక్ ఆమెకు దగ్గరయ్యాడని లేఖలో పేర్కొన్నారు. సహాయం చేస్తానని నమ్మించి, ఆమె ప్రైవేట్ విషయాలను తెలుసుకుని ఆ తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడని తెలిపారు. సౌజన్య అతడిని ఎదిరించిన ప్రతిసారి ఆమెపై దారుణంగా దాడులు చేసి కొట్టాడని వెల్లడించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఎప్పుడో చనిపోవాలని అనుకున్నప్పటికీ, తన చిన్న కుమారుడి భవిష్యత్తు కోసమే ఇన్నాళ్లూ బతికి ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తన భర్తకు ప్రమాదకరమైన రసాయనం (Chemical) ఇచ్చి సాదికే చంపేశాడని సౌజన్య లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు.
Soujanya Suicide Letter: కొడుకుని చంపుతానని బెదిరింపులు
కుటుంబానికి సంబంధించిన బ్యాంక్ వివరాలు, ఆస్తి పత్రాలను (Property Documents) కూడా సాదిక్ తన నియంత్రణలోనే ఉంచుకున్నాడని సౌజన్య వివరించారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొడుకుని చంపేస్తానని తీవ్రంగా బెదిరించాడని, తనకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయని భయపెట్టాడని తెలిపారు. తనపై పూర్తి నియంత్రణ సాధించి, ప్రతి విషయంలోనూ వేధించాడని, చివరికి తనను ఇస్లాం మతంలోకి మారాలని బలవంతం పెట్టాడని లేఖలో స్పష్టం చేశారు. మతం మారేందుకు నిరాకరిస్తే మరింత టార్చర్ పెడతానని హెచ్చరించాడని పేర్కొన్నారు.
సాదిక్ కుటుంబానికి చెప్పినా ఫలితం శూన్యం - న్యాయం జరగాలని విజ్ఞప్తి
సాదిక్ పెడుతున్న నరకం భరించలేక అతడి కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని సౌజన్య ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచి దెబ్బలు తిని ఎరుగని తాను సాదిక్ చేతిలో అనుభవించిన క్షోభ వర్ణనాతీతమని పేర్కొన్నారు. తనలాంటి పరిస్థితి మరొక మహిళకు ఎదురుకాకూడదని, ఇలాంటి నీచమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి వల్ల సమాజంలో ఇతర ముస్లింలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో రాసుకొచ్చారు. ఈ లేఖ ఆధారంగా పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపి నిందితుడు సాదిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

