Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్పీడందుకున్న కొడంగల్ రేడియల్ రోడ్డు!

స్పీడందుకున్న కొడంగల్ రేడియల్ రోడ్డు!

Kodangal Radial Road:కొడంగల్ నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొడంగల్ రేడియల్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ద్వారా మూడు జిల్లాల ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం లభించనుంది. మొత్తం 81 కిలోమీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్ల రోడ్డుగా దీనిని నిర్మిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3,295 కోట్లు కేటాయించడం జరిగింది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సుమారు 499 ఎకరాల భూసేకరణ విజయవంతంగా పూర్తి కావడంతో పనులకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలు చూస్తోంది.

Number Plate Morphing: నంబర్ ప్లేట్ మార్చితే కఠిన చర్యలు

 Kodangal is set for a transformation with radial roads!

గంటలోపే హైదరాబాద్ చేరుకునేలా సూపర్ కనెక్టివిటీ

ఈ నూతన రహదారి బుద్వేల్ ఓఆర్ఆర్ వద్ద ప్రారంభమై షాబాద్, పరిగి, దోమ మీదుగా దుద్యాల మండల హకీంపేట వరకు సాగుతుంది. నేషనల్ హైవే 167ను కలుపుతూ సాగే ఈ మార్గం ద్వారా రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాలు అనుసంధానం అవుతాయి. ప్రస్తుతం హైదరాబాద్ వెళ్లడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుండగా ఈ రోడ్డు పూర్తయ్యాక కేవలం గంటలోపే చేరుకోవచ్చు. నవంబర్ తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టికి భూమి పూజ జరగనుంది. ఏడాదిన్నర కాల వ్యవధిలో ఈ పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు.

Kodangal Radial Road:దుద్యాలలో భారీ ఇండస్ట్రియల్ కారిడార్ తో కొత్త ఉపాధి

ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందేలా దుద్యాల మండలంలో 1300 ఎకరాలలో మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. షాబాద్, పరిగి, దోమ మండలాల్లో కూడా ప్రత్యేక పారిశ్రామిక జోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ ఉండటం వల్ల పరిశ్రమలకు ముడిసరకు రవాణా చాలా సులభం అవుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతంలో పెట్టుబడులు సైతం వేగంగా పెరుగుతాయి. ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్ కనెక్షన్ల ద్వారా కొడంగల్ భవిష్యత్తులో ప్రధాన వ్యాపార కేంద్రంగా మారుతుంది.

Epaper: epaper.vaartha.com

పాతబస్తీలో మెట్రో విస్తరణ పనులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha