Dailyhunt
Sreeleela: హీరోయిన్ గానే గుర్తింపు కోరుకుంటున్నా

Sreeleela: హీరోయిన్ గానే గుర్తింపు కోరుకుంటున్నా

వార్త 2 months ago

'పరాశక్తి' సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న నటి శ్రీలీల(Sreeleela) స్పెషల్ సాంగ్స్‌పై తన స్పష్టమైన అభిప్రాయాలను పంచుకున్నారు. కెరీర్ ఆరంభ దశలోనే అలాంటి పాటలు చేయాలనుకుంటే అప్పుడే చేసేదాన్నని తెలిపారు.

కానీ హీరోయిన్గా నటిస్తున్న ప్రతి సినిమాలోని ప్రతి పాట(Special songs) ప్రేక్షకులకు ప్రత్యేకంగా అనిపించాలనేదే తన లక్ష్యమని వెల్లడించారు.

Read also:OTT: ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే!

స్పెషల్ సాంగ్స్ చేయను

ఇతర హీరోయిన్ ప్రధాన పాత్రలో ఉన్న సినిమాల్లో కేవలం ఒక పాట కోసం మాత్రమే కనిపించడం తనకు ఇష్టం లేదని శ్రీలీల స్పష్టం చేశారు. అయితే 'పుష్ప 2' సినిమాలో వచ్చిన అవకాశాన్ని తిరస్కరించలేదని, ఆ ప్రత్యేక పాట వల్ల తాను మరింత విస్తృతమైన ప్రేక్షక వర్గానికి చేరువయ్యానని చెప్పారు. అయినప్పటికీ, భవిష్యత్తులో స్పెషల్ సాంగ్స్ చేయాలనే ఆలోచన ప్రస్తుతం లేదని ఆమె తేల్చి చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Yami Gautam: 'హక్' మూవీ పై సమంత ఏమన్నారంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha