SpaceX IPO Boom: గ్లోబల్ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ, మోస్ట్ అవేటెడ్ ఐపీఓ (IPO) తో టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) సరికొత్త రికార్డు సృష్టించడానికి సర్వం సిద్ధం చేసుకుంది.
ఈ బిగ్గెస్ట్ పబ్లిక్ ఆఫరింగ్‌కు గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి కళ్లు చెదిరే రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ గ్లోబల్ బిజినెస్ మీడియా 'బ్లూమ్‌బెర్గ్' నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్లు (Institutional Investors) ఇప్పటికే ఏకంగా $10 బిలియన్లు (రూ. 83,000 కోట్లకు పైగా) లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో షేర్ల కొనుగోలు కోసం అడ్వాన్స్ ఆర్డర్లు పెట్టేసినట్లు తెలుస్తోంది.
Read also:Today Gold Rate: 10 రోజులుగా తగ్గిన పసిడి.. ఇవాళ ఒక్కసారిగా ఎంత పెరిగిందంటే!
SpaceX IPO Boom: సౌదీ అరామ్‌కో రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర వైపు
Elon Musk’s Space Firm Set to Break Saudi Aramco’s Biggest IPO Record
గతంలో ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక నిధులను సేకరించిన రికార్డు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ అయిన సౌదీ అరామ్‌కో (Saudi Aramco) పేరిట ఉంది. 2019లో సౌదీ అరామ్‌కో ఐపీఓ ద్వారా ఏకంగా $29.4 బిలియన్ల నిధులను సేకరించి రికార్డు సృష్టించింది. తాజా డిమాండ్ మరియు మార్కెట్ అంచనాలను బట్టి చూస్తే.. స్పేస్‌ఎక్స్ ఐపీఓ ఆ రికార్డును ఈజీగా దాటేసి ప్రపంచంలోనే అత్యంత భారీ ఐపీఓగా రికార్డు సృష్టించబోతోంది. స్టార్‌లింక్ (Starlink) గ్లోబల్ శాటిలైట్ ఇంటర్నెట్ విజయం, పునర్వినియోగ రాకెట్ల (Reusable Rockets) తయారీ మరియు భవిష్యత్తులో అంగారక గ్రహం (Mars) పైకి ప్రయాణాల ప్రాజెక్టుల కారణంగా ఈ ఐపీఓపై ఇన్వెస్టర్లలో నమ్మకం అమాంతం పెరిగిపోయింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

