Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్టాలిన్ కు సెక్యూరిటీని తగ్గించిన విజయ్ సర్కార్

స్టాలిన్ కు సెక్యూరిటీని తగ్గించిన విజయ్ సర్కార్

వార్త 1 month ago

Tamilanadu : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్‌ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం Z+ నుంచి Z కేటగిరీకి కుదించింది.

ఇంటెలిజెన్స్ నివేదికలు, ముప్పు అంచనా (Threat Assessment) మరియు రక్షణ అవసరాలపై పోలీసులు నిర్వహించిన సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆయన భద్రతా సిబ్బంది సంఖ్య 54 నుంచి 34కు తగ్గనుంది. చెన్నైలోని అల్వార్‌పేట్ సెనోటాఫ్ రోడ్డులో ఉన్న ఆయన నివాసం వద్ద కాపలా ఉండే సెక్యూరిటీతో పాటు కాన్వాయ్ కమాండోల సంఖ్యను కూడా అధికారులు సవరించారు.

 Tamil Nadu

రాజకీయ కక్ష సాధింపేనంటూ విమర్శలు

రాష్ట్రంలో విఐపి (VIP)లకు కేటాయించే భద్రతపై ఆరు నెలలకోసారి క్రమం తప్పకుండా నిర్వహించే రివ్యూ మీటింగ్‌లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే, రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే విజయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. సాధారణ భద్రతా సమీక్షల ప్రాతిపదికన మాత్రమే రక్షణ కవచాన్ని సవరించామని, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భద్రత తగ్గినప్పటికీ Z కేటగిరీ నిబంధనల ప్రకారం కాన్వాయ్‌లో పైలట్, వాహనాలు మరియు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (PSO) భద్రత ఆయనకు కొనసాగనుంది.

పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడిపై 'పిల్' తిరస్కరించిన సుప్రీంకోర్టు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha