Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు.. SECకి కూటమి ఫిర్యాదు

స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు.. SECకి కూటమి ఫిర్యాదు

వార్త 2 days ago

Local Body Elections : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వేళ, ఎన్నికలను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర కుట్రలు పన్నుతున్నారని కూటమి నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

స్థానిక సమరంలో వైఎస్సార్‌సీపీ నాటకాలకు తెరలేపిందని మండిపడ్డారు. తమ నామినేషన్ పత్రాలను తమ నాయకులే స్వయంగా చించుకోవడమే కాకుండా, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. వైసీపీ శ్రేణుల తీరు, అరాచకాలు పూర్వపు ‘స్టువర్టుపురం ముఠా’ వ్యవహారంలా తయారయ్యాయని, గ్రామాల్లో భయాందోళనలు సృష్టించి ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చర్యలు తీసుకోవాలని ఆదేశాలు: ఎస్‌ఈసీకి టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతినిధులు

వైసీపీ నాయకులు సాగిస్తున్న ఈ అక్రమాలు, అరాచకాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కూటమి ప్రతినిధులు వర్ల రామయ్య, చిల్లపల్లి శ్రీనివాస్, పాతూరి నాగభూషణంలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) అధికారులను కలసి వినతిపత్రం అందజేశారు. నిష్పాక్షికంగా, శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియను అడ్డుకుంటున్న వారిని, పోలీసులపై దాడులకు పాల్పడుతున్న అరాచక శక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని ఎస్‌ఈసీని వారు లేఖ ద్వారా కోరారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల పంపకంపై కూటమి మంతనాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha