Local Body Elections in AP 2026 : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల వేళ పులివెందుల మున్సిపాలిటీలోని 15వ వార్డు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకోనుండటంతో అందరి దృష్టి దీనిపైనే కేంద్రీకృతమైంది. జగన్ ఓటు వేయనున్న నేపథ్యంలో ఈ వార్డులో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో రాజకీయ సందడి పెరగగా, ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ విజయావకాశాలపై ఆశలు పెట్టుకున్నారు.
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి కొల్లు రవీంద్ర ఏమన్నారంటే?నలుగురు అభ్యర్థుల మధ్య పోటీ.. ఫలితంపై ఉత్కంఠ
పులివెందుల మున్సిపాలిటీలోని 15వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెద్దింటి శివ బరిలో నిలిచారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు బండిబోయిన కమలనాథ్, కొత్తరెడ్డి మల్లికార్జున్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. దీంతో ఈ వార్డులో పోటీ ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల పర్యటన, ఆయన ఓటు హక్కు వినియోగం నేపథ్యంలో ఈ వార్డు ఎన్నికలపై రాజకీయ పరిశీలకులు, పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. అయితే, విజయం ఎవరిని వరిస్తుందనేది ఓటర్ల తీర్పు వెల్లడైన తర్వాతే స్పష్టమవుతుంది.

