Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'స్థానిక' ఎన్నికలు.. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

'స్థానిక' ఎన్నికలు.. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

వార్త 1 month ago

Local Body Elections in AP 2026 : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

పోలింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి అవసరమైన మెటీరియల్ సేకరణ, బ్యాలెట్ బాక్సులు లేదా పోలింగ్ పరికరాల సన్నాహకాల కోసం తక్షణమే టెండర్లు నిర్వహించాలని సూచించింది. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియకు అడ్డంకిగా మారిన న్యాయపరమైన అంశాలు, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

 AP Local Body Elections

అక్టోబర్‌లో పోరుకు కసరత్తు: రిజర్వేషన్లు, చట్టసవరణలపై కసరత్తు

రాబోయే అక్టోబర్ నాటికి స్థానిక ఎన్నికలను నిర్వహించాలనే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికోసం బిసి, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఖరారును పూర్తి చేయడంతో పాటు, అవసరమైన చట్టసవరణలను వేగవంతం చేయాలని భావిస్తోంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సైతం ఈ సన్నాహకాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ, ఓటర్ల జాబితా రూపకల్పన మరియు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో యంత్రాంగం సమాయత్తమవుతుండటంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది.

నాగబాబుకు కేబినెట్ హోదా.. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha