Australia increases student visa fees: ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే భారతీయులకు షాక్ తగిలింది. జూలై 1, 2026 నుంచి పలు వీసా కేటగిరీల ఫీజులను భారీగా పెంచుతూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీనివల్ల భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులపై ఆర్థిక భారం గణనీయంగా పెరగనుంది. ముఖ్యంగా స్టూడెంట్ (సబ్‌క్లాస్ 500), టెంపరరీ గ్రాడ్యుయేట్ (సబ్‌క్లాస్ 485) వీసాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న వలసలను నియంత్రించేందుకే ఫెడరల్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్ వీసా కోసం చెల్లించే బేస్ అప్లికేషన్ ఛార్జీలు (VAC) ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువయ్యాయి. గతంలో ప్రాథమిక దరఖాస్తుదారులకు 710 ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉన్న ఫీజును ఇప్పుడు 1,600 డాలర్లకు పెంచారు. అంటే భారత కరెన్సీలో దాదాపు 90 వేల రూపాయల అదనపు భారం పడనుంది.
Read Also: Iran : ఇరాన్ ఫండ్స్ విడుదలకు అమెరికా గ్రీన్ సిగ్నల్!
Australia increases student visa fees
Australia increases student visa fees: ఆస్ట్రేలియాకు బదులు ఇతర దేశాలను ఎంచుకునే అవకాశం
దీంతో విదేశీ విద్య కోసం ప్లాన్ చేసుకుంటున్న భారతీయ కుటుంబాలు తమ బడ్జెట్‌ను, ఎడ్యుకేషన్ లోన్ మొత్తాన్ని మళ్లీ లెక్కవేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ భారీ ధరల వల్ల కొంతమంది విద్యార్థులు ఆస్ట్రేలియాకు బదులు ఇతర దేశాలను ఎంచుకునే అవకాశం ఉంది. వీసా ఫీజులతో పాటు బయోమెట్రిక్స్, మెడికల్ టెస్టుల ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయి. ఆస్ట్రేలియా స్టూడెంట్ 500, 485 వీసా ఫీజుల పెంపు ప్రభావం చదువు పూర్తయ్యాక అక్కడే ఉండి పని చేయాలనుకునే గ్రాడ్యుయేట్లకు కూడా ఫీజుల సెగ తగులుతోంది. టెంపరరీ గ్రాడ్యుయేట్ (సబ్‌క్లాస్ 485) వీసా ఫీజు ఇప్పుడు 1,895 ఆస్ట్రేలియన్ డాలర్లకు చేరింది. ఒకవేళ భార్యాపిల్లలను కూడా డిపెండెంట్లుగా తీసుకెళ్లాలనుకుంటే ఆ ఖర్చు తడిసి మోపెడవుతుంది.

