Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుచరిత ఇళ్లపై ఏసీబీ రైడ్స్.. ₹50 కోట్ల అక్రమాస్తులు సీజ్!

సుచరిత ఇళ్లపై ఏసీబీ రైడ్స్.. ₹50 కోట్ల అక్రమాస్తులు సీజ్!

వార్త 1 week ago

Tahsildar Sucharitha ACB Raids: లంచం కేసులో దొరికిపోయి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌ మాజీ తహసీల్దార్‌ తుమ్మకొమ్మ సుచరిత (Susharitha) అక్రమాస్తుల సామ్రాజ్యాన్ని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బద్దలు కొట్టారు.

ఆదాయానికి మించిన ఆస్తులు (Disproportionate Assets) కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో గురువారం ఏకకాలంలో ఆమె నివాసంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లపై ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు.

Read Also:Ketan Agarwal Murder Case: కేతన్ అగర్వాల్ హత్య.. ప్రియుడి బ్లాక్‌మెయిల్ వల్లేనా?

మార్కెట్ విలువ ₹50 కోట్లకు పైనే!

అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, ఆస్తుల ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ₹5,05,52,465 గా నిర్ధారించారు. అయితే బహిరంగ మార్కెట్‌లో వీటి అసలు విలువ ₹50 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ వర్గాలు భావిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా మార్కూక్‌ మండలం దామరకుంటలో 2 ఎకరాల 17 గుంటల విలువైన వ్యవసాయ భూమిని అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాల్లో 3 విలాసవంతమైన ఫ్లాట్లు, అలాగే కీసర, ఖానామెట్‌ ప్రాంతాల్లో రెండు ఖరీదైన నివాస స్థలాల (ఓపెన్ ప్లాట్లు) డాక్యుమెంట్లను కనుగొన్నారు.

నగదు, బంగారం, లగ్జరీ కార్ల సీజ్

ఇంట్లో దాచిన దాదాపు ₹1.20 కోట్ల విలువైన భారీ బంగారు నగల శ్రేణి, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో లభ్యమైన ₹12 లక్షల లిక్విడ్ క్యాష్‌తో పాటు, వివిధ బ్యాంకు ఖాతాలలో ఫ్రీజ్ చేసిన ₹38 లక్షల నగదు నిల్వలను సీజ్ చేశారు. ఆమె వాడుతున్న వోక్స్‌వ్యాగన్ (Volkswagen), హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) వంటి రెండు లగ్జరీ కార్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Tahsildar Sucharitha ACB Raids: ₹30 లక్షల లంచం కేసు.. చంచల్‌గూడ జైలులో రిమాండ్

ఈ అక్రమాస్తుల తవ్వకానికి పునాది గత నెలలో జరిగిన ఓ భారీ లంచం ఉదంతమే. శామీర్‌పేట్‌ మండలం అలియాబాద్‌ పరిధిలోని 30 ఎకరాల భూమిని నాలా (వ్యవసాయేతర భూమి) మార్పిడి చేయడానికి సుచరిత ఎకరాకు ₹1 లక్ష చొప్పున మొత్తం ₹30 లక్షలు లంచం డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ.. గత మే 26న మధ్యవర్తి ద్వారా మొదటి విడతగా ₹2 లక్షలు లంచం తీసుకుంటుండగా సుచరితను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె సస్పెన్షన్‌లో ఉంటూ చంచల్‌గూడ మహిళా జైలులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా ఈ ఆస్తుల కేసుతో ఆమె చుట్టూ ఉచ్చు మరింత బిగిసింది.

Epaper: epaper.vaartha.com

దారుణం.. నిస్సహాయ చిన్నారిపై అంగన్‌వాడీ టీచర్ దాష్టీకం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha