SC On Footpath : దేశవ్యాప్తంగా రహదారులపై పాదచారుల భద్రతను నిర్ధారించడానికి మరియు వారి హక్కులను పరిరక్షించడానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
దేశంలోని ప్రతి రహదారిపై పాదచారులు ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా నడిచేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాదచారుల కోసం కేటాయించిన ఈ ప్రదేశం ఆక్రమణలకు గురికాకుండా, సాధారణ వాహనాల మార్గం నుంచి స్పష్టంగా వేరు చేసి గుర్తించాలని పేర్కొంది. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతూ, కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌కు పలు సూచనలు చేసింది. “పాదచారుల మార్గాల కోసం భారీ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తాడు లేదా ఇతర తాత్కాలిక గుర్తులతోనైనా రహదారిపై పాదచారుల మార్గాన్ని స్పష్టంగా వేరు చేయాలి” అని స్పష్టం చేసింది. సంబంధిత శాఖలకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని కేంద్రానికి సూచిస్తూ, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
SC On Footpath
SC On Footpath : ఫుట్‌పాత్‌పై నడవడం ప్రాథమిక హక్కే!
జూన్ 19న ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, ప్రత్యేకంగా గుర్తించిన ఫుట్‌పాత్‌పై నడవడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని అత్యున్నత న్యాయస్థానం పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా సంచరించే హక్కు. జీవించే హక్కు (పాదచారుల భద్రత కూడా ఇందులో భాగమే). కేటాయించిన పాదచారుల మార్గాల్లో మోటారు వాహనాల కంటే పాదచారుల హక్కుకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది.

